ఆన్‌లైన్‌లో డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌-2

ABN , First Publish Date - 2020-06-06T06:52:40+05:30 IST

ఈ నెల 1 నుంచి హైదరాబాద్‌ డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌-2 (డీఆర్‌టీ-2)...ఆన్‌లైన్‌ ద్వారా కార్యకలాపాలను కొనసాగిస్తోందని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రిబ్యునల్‌

ఆన్‌లైన్‌లో డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌-2

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఈ నెల 1 నుంచి హైదరాబాద్‌ డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌-2 (డీఆర్‌టీ-2)...ఆన్‌లైన్‌ ద్వారా కార్యకలాపాలను కొనసాగిస్తోందని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రిబ్యునల్‌ ప్రిసైడింగ్‌ అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణను చేపడతారని తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉపయోగించి పేపర్‌ వర్క్‌తో ఎలాంటి పని లేకుండా కేసులను విచారిస్తారని పేర్కొన్నారు. అత్యవసర కేసులు ఉన్న వారు ఈ-ఫైలింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ కేసులను కూడా డీఆర్‌టీ-2లో అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తామని తెలిపారు.


Updated Date - 2020-06-06T06:52:40+05:30 IST