రుణ పరిమితి పెంపు!

ABN , First Publish Date - 2021-04-09T06:27:09+05:30 IST

జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరం రైతులకు ఇచ్చే రుణ పరిమితిని (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ను ఖరారు చేశారు. వచ్చే వానాకాలం, యాసంగిలో రైతులకు ఈ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారమే రుణాలను పంటలకు ఇవ్వనున్నారు. ఆయా బ్యాంకుల పరిధిలో నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా పంట రుణాలను పంపిణీ చేయనున్నారు. రైతులకు ఇచ్చే రుణాల ఆధారంగానే పంటల బీమాను కూడా వర్తింపజేయనున్నారు.

రుణ పరిమితి పెంపు!

వచ్చే వానాకాలం నుంచి పంటలకు

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంపు 

దీని ఆధారంగానే జిల్లా రైతులకు రుణాలు

వరి, పసుపు, మొక్కజొన్న, జవారుకు పెరిగిన రుణ పరిమితి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరం రైతులకు ఇచ్చే రుణ పరిమితిని (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌)ను ఖరారు చేశారు. వచ్చే వానాకాలం, యాసంగిలో రైతులకు ఈ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారమే రుణాలను పంటలకు ఇవ్వనున్నారు. ఆయా బ్యాంకుల పరిధిలో నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా పంట రుణాలను పంపిణీ చేయనున్నారు. రైతులకు ఇచ్చే రుణాల ఆధారంగానే పంటల బీమాను కూడా వర్తింపజేయనున్నారు. 

ప్రతీ సంవత్సరం రైతులకు ఇచ్చే పంట రుణాలను బ్యాంకర్ల కమిటీలో ఖరారు చేస్తారు. ప్రతీ పంటకు అయ్యే  ఖర్చు ఆధారంగా రుణపరిమితిని నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగానే ఆయా పంటలకు అనుగుణంగా రైతులకు రుణాలను పంపిణీ చేస్తారు. ప్రతీ సంవత్సరం పెరిగే వ్యవసా య ఖర్చులను బట్టి ఈ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలను మంజూ రు చేస్తారు. 

ఈ ఏడాది కూడా పెరిగిన రుణ పరిమితి..

ఈ ఏడాది కూడా పంటలకు ఇచ్చే రుణ పరిమితిని పెంచారు. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరితో పాటు మొక్కజొన్న, పసుపు ఇతర పంటలకు ఈ స్కేల్‌ ఆఫ్‌ఫైనాన్స్‌ పెంచారు. దీని ప్రకారమే రుణాలను వచ్చే వానాకా లం, యాసంగిలో రైతులకు మంజూరు చేయనున్నారు. జిల్లాలో ఈ రెం డు సీజన్‌లలో ఎంత మొత్తంలో రుణాలు ఇవ్వాలో వచ్చే వారం లోపు బ్యాంకర్ల కమిటీలో నిర్ణయం తీసుకొని ప్రకటించనున్నారు. లక్ష్యాలకు అను గుణంగా పెంచిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలను మంజూరు చే యనున్నారు. వచ్చే వానాకాలం, యాసంగి సాగును దృష్టిలో పెట్టుకుని వరికి దీనిని పెంచారు. 

కూరగాయల సాగుకు.. 

ఇతర కూరగాయలు సాగుచేసే రైతుల కోసం గతంలో ఇచ్చిన రుణాల కన్నా ఎక్కువ మొత్తంలో పెంచారు. ఇవేకాకుండా పండ్ల తోటలకు కూడా రుణ పరిమితిని పెంచారు. జిల్లాలో అరటి సాగుచేసే రైతులకు ఇప్పటి వరకు ఎకరాకు రూ.86వేలు ఇస్తుండగా రూ.95వేలకు పెంచారు. జిల్లాలో మామిడి పండించే రైతులకు ఎకరాకు రూ.55వేలు ఇస్తుండగా ప్రస్తుతం రూ.65వేలకు పెంచారు. ఇతర పండ్ల తోటలకు కూడా ఇచ్చే రుణ పరిమితిని పెంచారు. సాగు ఖర్చు పెరుగుతుండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. జిల్లా బ్యాంకర్ల కమిటీలో జిల్లా వ్యవసాయ రుణాలను ఖరారు చే సిన తర్వాత వచ్చే వానాకాలం నుంచి ఈ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పెంచిన రుణాలను అందించనున్నారు. 

వరికి రూ.38 వేలు.. పసుపునకు రూ.75 వేలు 

జిల్లాలో ఇప్పటి వరకు ఎకరాకు 34 వేల రూ పాయలు రుణం ఇస్తుండగా, ఈ దఫా వరి పం డించే రైతులకు 38 వేల రూపాయలను రుణాలుగా ఇచ్చేలా రుణ పరిమితిని పెంచారు. దీంతో పాటు మొక్కజొన్నకు ఇప్పటివరకు రూ.25వేలు ఎకరాకు రుణం ఇస్తుండగా పెంచిన దానిప్రకా రం రూ.28వేలుగా నిర్ణయించారు. జిల్లాలో సాగ య్యే జవారుకు ఇప్పటి వరకు రూ. 14వేలు ఇవ్వ గా రూ.18వేలకు పెంచారు. కందులకు ఎకరాకు ఇప్పటి వరకు రూ.17వేలు ఇవ్వగా రూ.20వేలకు పెంచారు. మినుములకు రూ.15వేలు ఉండగా రూ.18వేలకు పెంచారు. పెసరకు రూ.15వేలు ఉండగా రూ.17వేలు, సోయాబిన్‌కు రూ.22వేలు ఉండగా రూ.24వేలకు పెంచారు. వేరుశనగకు ఇ ప్పటి వరకు రూ.24వేలు ఉండగా ఎకరాకు రూ. 26వేలుగా నిర్ణయించారు. జిల్లాలో ఎక్కువగా పండించే పసుపునకు ఖర్చు ఎక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు రూ.70 వేలు ఎకరాకు ఇవ్వగా ప్రస్తుతం రూ.75వేలుగా నిర్ణయించారు. మిరప సాగుచేసే రైతులకు ఇప్ప టి వరకు రూ.60వేలు ఎకరాకు ఇవ్వగా ప్రస్తుతం రూ.70వేలకు పెంచారు. చెరుకు పండించే రైతుల కు ఇప్పటి వరకు రూ.60వేలు ఇవ్వ గా రూ.62వేలకు పెంచారు. టమాట రై తులకు ఇప్పటి వరకు ఎకరాకు రూ.44వేలు ఇస్తుండగా రూ.50వేలకు పెంచారు.

యాసంగిలో 84 శాతం రుణ పంపిణీ..

జిల్లాలో ఈ యాసంగిలో 84శాతం రుణ పంపిణీ చేశారు. జిల్లాలోని రై తులకు ఈ యాసంగిలో 1368.84 కోట్ల రూపాయలను రుణాలుగా ఇవ్వా లని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో అక్టోబ రు నుంచి మార్చి చివరి వరకు 1162.20 కోట్ల రూపాయలను రుణాలుగా రైతులకు అందించారు. జిల్లాలో ఈ యాసంగిలో మొత్తం లక్షా 13వేల 316 మంది రైతులకు ఈ రుణాలను పంపిణీ చేశారు. జిల్లాలో నిర్ణయించిన లక్ష్యంకి అనుగుణంగానే ఈ రుణాలను అందించినట్లు జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జయా సంతోషి తెలిపారు. వచ్చే వానాకాలం యాసంగి కోసం రుణ పరిమితిని పెంచామని ఆమె తెలిపారు. జిల్లాలో ప్రతియేడు రైతులకు పెట్టుబడి పెరుగుతున్నందున ప్రభుత్వం స్కేల్‌ ఆఫ్‌ఫైనాన్స్‌ను పెంచుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్‌ తెలిపారు. పెంచిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులకు వారు సాగుచేసే పంటల ఆధారంగా రుణాలు అందిస్తారని తెలిపారు. జిల్లాలో వరి, పసుపు, మొక్కజొన్న, ఇతర పంటలు ఎక్కువసాగు చేస్తున్నందున పెంచిన రుణ పరిమి తి వారికి మేలు చేస్తుందని తెలిపారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. ఎప్పకప్పుడు పంటలను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట రుణాల పరిమితి పెరగడం చాలా ఆనం దంగా ఉందని అన్నారు. 


Updated Date - 2021-04-09T06:27:09+05:30 IST