Abn logo
Aug 12 2020 @ 20:19PM

వైసీపీ ఎమ్మెల్యేనే అంటున్న రాపాకపై పవన్ ఎలా స్పందిస్తారు?

హైదరాబాద్: జనసేన, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘జనసేన ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలకు అర్థమేంటి?. వైసీపీ ఎమ్మెల్యేనే అంటున్న రాపాకపై పవన్ ఎలా స్పందిస్తారు?. జగన్ అంగీకారం లేకుండానే రాపాక అలా ప్రకటించుకున్నారా?. పార్టీ మారిన ఎమ్మెల్సీలు వైసీపీలో ఎలా ఉన్నారు?. నీతి వంతమైన రాజకీయాలు సిద్ధాంతాలకు అప్పుడే కాలం చెల్లిందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మారెడ్డి శివశంకర్, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ రాష్ట్ర ఉపాధక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.  బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి తమ్మారెడ్డి శివశంకర్ మాట్లాడుతూ రాపాక వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదన్నారు. గతంలో రాపాక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఆయనకు 316 ఓట్లు మాత్రమే వచ్చియని గుర్తు చేశారు. 2019లో రాజోలు నియోజకవర్గ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు.  జనసైనికుల కృషి వల్లే గెలిచానని ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించిన జనసేన అంతర్గత సమావేశంలో రాపాక చెప్పినట్లు శివశంకర్ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement