2 వేలు దాటిన మరణాలు

ABN , First Publish Date - 2020-08-10T09:50:55+05:30 IST

రాష్ట్రంలో కరోనా మరణాలు 2వేల మార్కును దాటేశాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 10,820 మందికి వైరస్‌ సోకగా.. 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో

2 వేలు దాటిన మరణాలు

  • కరోనాకు మరో 97 మంది బలి
  • రాష్ట్రంలో కొత్తగా 10,820 కేసులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా మరణాలు 2వేల మార్కును దాటేశాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 10,820 మందికి వైరస్‌ సోకగా.. 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,27,860కి చేరుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 2,036కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1543 మంది కరోనా బారినపడ్డారు. కర్నూలులో 1,399, పశ్చిమగోదావరిలో 1,132, విశాఖపట్నంలో 961 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మరో 9,097 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకూ 1,38,712 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87,112 మంది కరోనాకు చికిత్స పొందుతున్నా రు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గుంటూరులో 12, ప్రకాశంలో 11, చిత్తూరులో 10, పశ్చిమగోదావరిలో 10, అనంతపురంలో 8, కడపలో 8, శ్రీకాకుళంలో 8, కర్నూలులో 7, తూర్పుగోదావరిలో 6, విశాఖపట్నంలో 6, కృష్ణాలో 4, నెల్లూరులో 4, విజయనగరంలో ముగ్గురు మృతి చెందారు. కాగా.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల శాతం భారీగా పెరిగింది. గత ఆదివారం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల శాతం 7.69 ఉండగా, భారత్‌ శాతం 8.84 మాత్రమే ఉంది. ఈ వారం దేశ శాతాన్నే మించి పోయింది. ఈ వారం భారత్‌ శాతం 8.93 ఉండగా రాష్ట్రంలో పాజిటివ్‌ల శాతం 9.16 వరకూ ఉంది.


తూర్పులో ఏడుగురు కానిస్టేబుళ్లకు కరోనా

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా దూకుడు కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో ఇక్కడ 1,543 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,703 చేరింది. జిల్లాలో అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏడుగురు కానిస్టేబుళ్లకు కొవిడ్‌గా నిర్ధారణయ్యింది. ఒక ప్రైవేట్‌ డ్రైవర్‌కు కూడా వైరస్‌ సోకింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 881 మందికి పాజిటివ్‌ వచ్చింది. గుంటూరు నగరంలో 313 కేసులు బటయపడగా.. పిడుగురాళ్లలో 87, నరసరావుపేటలో 81, తెనాలిలో 76, పొన్నూరులో 62, చిలకలూరిపేటలో 49 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో 1,399 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 27,431కి చేరింది. ఇందులో 9,372 యాక్టివ్‌ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో ఆదివారం 961 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,905కి చేరింది. కరోనాతో మరో ఆరుగురి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో తాజాగా 696 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో మరో 858 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 24,107కు చేరింది. వారిలో 16,927 మంది డిశ్చార్జ్‌ కాగా.. 7010 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరో 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 452 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11,082కు చేరింది. చిత్తూరు జిల్లాలో మరో 848 మందికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు 10వేలు దాటేశాయి. ఆదివారం కొత్తగా 439 మందికి వైరస్‌ సోకింది. కడప జిల్లాలో ఒకేరోజు 8 మంది కరోనా కాటుకు బలయ్యారు. జిల్లాలో మరో 823 మందిలో వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాటిజివ్‌ బాఽఽధితుల సంఖ్య 13,622కు చేరుకుంది.

Updated Date - 2020-08-10T09:50:55+05:30 IST