మహారాష్ట్ర వరదల్లో 164కు పెరిగిన మృతుల సంఖ్య... 100 మంది గల్లంతు!

ABN , First Publish Date - 2021-07-27T12:15:18+05:30 IST

మహారాష్ట్రలోని రాయగఢ్‌లో 11 మృతదేహాలు, వార్థా, అకోలాలో రెండేసి మృతదేహాలను...

మహారాష్ట్ర వరదల్లో 164కు పెరిగిన మృతుల సంఖ్య... 100 మంది గల్లంతు!

ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో 11 మృతదేహాలు, వార్థా, అకోలాలో రెండేసి మృతదేహాలను వెలికితీయడంతో భారీవర్షాలు, వరదల తాకిడికి ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 164గా తేలింది. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్.. సంగలీ జిల్లాలలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. బాధిత కుటుంబాలకు ఒకటి రెండు రోజుల్లో ఆర్థిక సహాయం అందించడం గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం వరదల తాకిడికి 100 మంది వరకూ గల్లంతయ్యారని, ఇప్పటివరకూ 2,29,074 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొంది. ముఖ్యంగా రాయగఢ్ జిల్లా వరదలకు అత్యధికంగా ప్రభావితమయ్యిందని, ఈ ప్రాంతానికి చెందిన 31 మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఒక అధికారి తెలిపారు. 


Updated Date - 2021-07-27T12:15:18+05:30 IST