Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేగంగా వస్తున్న రైలు.. ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపై తల పెట్టిన యువకుడు.. సెకెన్ల వ్యవధిలో ఏం జరిగిందంటే..

ఒక వ్యక్తి రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.. ఎదురుగా ట్రైన్ అత్యంత వేగంగా వస్తోంది.. ఆ వ్యక్తి వెంటనే రైలు పట్టాలపై పడుకున్నాడు.. ఆ దృశ్యాన్ని చూసిన రైలు లోకో పైలెట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.. దీంతో రైలు అతడికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది.. రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.. ముంబైలోనీ సేర్వీ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆత్మహత్య చేసుకోవడానికి ఓ వ్యక్తి సేర్వీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఎదురుగా లోకల్ ట్రైన్ రావడం చూసి వెంటనే రైలు పట్టాలపై అడ్డంగా పడిపోయాడు. తల సరిగ్గా ట్రాక్ మీద పెట్టాడు. అయితే ఆ వ్యక్తిని చూసిన రైలు లోకో పైలెట్ వెంటనే ఎమర్జేన్సీ బ్రేక్‌ను అప్లయ్ చేసి రైలును ఆపేశాడు. అది లోకల్ ట్రైన్ కాబట్టి వెంటనే ఆగిపోయింది. రైల్వే సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement