Ashok Gehlot: అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం

ABN , First Publish Date - 2022-08-08T02:45:30+05:30 IST

దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి చట్టమే కారణమంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) చేసిన

Ashok Gehlot: అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం

జైపూర్: దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి చట్టమే కారణమంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ‘బ్లాక్ ప్రొటెస్ట్’ (black protest)లో గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి పాల్పడే వారిని ఉరి తీసే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయని అన్నారు.


నిర్భయ కేసు (Nirbhaya Case) తర్వాత అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయాలన్న డిమాండ్ ఊపందుకుందని, ఆ తర్వాత చట్టం అమల్లోకి వచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఆ తర్వాతి నుంచే అత్యాచారం చేసి హత్య చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయని గెహ్లాట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడీ ప్రమాదకరమైన ట్రెండ్ దేశంలో నడుస్తోందని అన్నారు. 


ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సీఎం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) లోకేశ్ శర్మ వివరణ ఇచ్చారు. అత్యాచార బాధితులను హత్య చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం తన ఆందోళనను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అంతే తప్ప ఆయన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం ఏమీ లేదన్నారు. సీఎం మాట్లలోని అవేదనను అర్థం చేసుకోవాలని, అనవసర రాద్ధాంతం వద్దని లోకేశ్ శర్మ విజ్ఞప్తి చేశారు. సీఎం మరో ఓఎస్డీ  శశికాంత్ శర్మ మాట్లాడుతూ.. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న నేరాలపై సీఎం మాట్లాడారని వివరించారు. బీజేపీ ఐటీ సెల్ దానిని వక్రీకరించిందని ఆరోపించారు. 

Updated Date - 2022-08-08T02:45:30+05:30 IST