May 13 2021 @ 04:32AM

కొవిడ్‌తో సంగీత దర్శకుడు చంద్రశేఖర్‌ మరణం

సంగీత దర్శకుడు, ఆల్‌ ఇండియా రేడియో సంగీత దర్శకుడు కె.ఎస్‌.చంద్రశేఖర్‌ మంగళవారం కొవిడ్‌తో కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దాసరి దర్శకత్వం వహించిన ‘బంట్రోతు భార్య’ చిత్రంతో గాయకునిగా సినీ రంగప్రవేశం చేసిన చంద్రశేఖర్‌ ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర చేరి, 70కి పైగా చిత్రాలకు ఛీఫ్‌ అసోసియేట్‌గా పని చేశారు. ఆ తర్వాత రమేశ్‌ నాయుడు దగ్గర 40 చిత్రాలకు పని చేశారు. చిరంజీవి నటించిన ‘యమకింకరుడు’ చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘బ్రహ్మముడి’, ‘ హంతకుడి వేట’, ‘ఆణిముత్యం’, ‘ఉదయం’, ‘అదిగో అల్లదుగో’, ‘భోళాశంకరుడు’‘, ‘ఆత్మబంధువులు’ తదితర 30కి పైగా చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆ తర్వాత విశాఖపట్నం ఆల్‌ ఇండియా రేడియో  గ్రేడ్‌ 1 మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సేవలు అందించి ఇటీవలే రిటైర్‌ అయ్యారు.