రైతు శ్రేయోభిలాషి సింగయ్య చౌదరి మృతి

ABN , First Publish Date - 2022-07-06T05:58:04+05:30 IST

కొరిశపాడు మండలం రావినూతల సొసైటీ మాజీ అధ్యక్షుడు, పీడీసీసీ బ్యాంకు మాజీ డైరె క్టర్‌, రైతు శ్రేయోభిలాషి కారుసాల సింగయ్య చౌదరి (82) ఇకలేరు.

రైతు శ్రేయోభిలాషి సింగయ్య చౌదరి మృతి
సింగయ్య చౌదరి(ఫైల్‌)

40 ఏళ్లు రావినూతల సొసైటీ అధ్యక్షుడిగా సేవలు

ప్రముఖుల నివాళి 

మేదరమెట్ల, జూలై 5: కొరిశపాడు మండలం రావినూతల సొసైటీ మాజీ అధ్యక్షుడు, పీడీసీసీ బ్యాంకు మాజీ డైరె క్టర్‌, రైతు శ్రేయోభిలాషి కారుసాల సింగయ్య చౌదరి (82) ఇకలేరు. అనారోగ్యంతో ఆయన మంగళవారం కన్నుమూశారు. సింగయ్య చౌద రి రావినూతల సొసైటీఅధ్యక్షుడుగా 40 సంవత్సరాలు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అభివృద్ధి చెందిన సొసైటీగా రావి నూతలకు గుర్తింపు తెచ్చారు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రకాశం జిల్లాలో తొలిసారిగా రావినూతలకు వచ్చి సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి కిలో రూ. 2కే బియ్యం పథకానికి శ్రీకారం పలికారు. సొసైటీ ద్వారా ఎరువుల వ్యాపారం, రేషన్‌ డీలర్‌ దుకాణం, వస్త్ర వ్యాపారం, ఆర్టీసీ టికెట్‌ల రిజర్వేషన్‌ వంటి వ్యాపారాలు సింగయ్య చౌదరి హయాంలోనే ప్రారం భించారు. తొలుత  స్వత్రంత పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభిం చిన ఆయన 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మె ల్యే డాక్టర్‌ బాచిన చెంచు గరటయ్య ముఖ్య అనుచరుడిగా ప్రయా ణించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలోనే కొనసాగారు. సింగ య్య చౌదరికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

పలువురు ప్రముఖుల నివాళి

సింగయ్య చౌదరి మృతి వార్త తెలుసుకున్న శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీ పీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య రావినూతల వచ్చి ఆయన భౌతికకాయాన్ని సంద ర్శించి నివాళులర్పించారు. వారి వెంట రావినూతల, కుర్రవానిపాలెం సర్పంచ్‌లు చాట్ల విజయ వీణ, నాదెండ్ల దశరథరామయ్య,  వైసీపీ మండల కన్వీనర్‌ సాధినేని మస్తాన్‌రావు తదితరులు ఉన్నారు. 

ఫోన్‌లో పరామర్శించిన ఎమ్మెల్యే రవికుమార్‌

సమాచారం తెలుసుకున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సింగయ్య చౌదరి తనయుడు కారుసాల నాగేశ్వరరావు(బాబు)కు ఫో న్‌చేసి పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి  తెలిపారు. సింగయ్య చౌదరి ఎప్పుడు రైతుల సమస్యలు గురించే అడిగేవారన్నారు. మచ్చలే ని ఆయన రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు.  సింగయ్య చౌదరి కుటుంబ సభ్యులను పేరు పేరున పలకరించి వారికి ధైర్యం చెప్పారు.

Updated Date - 2022-07-06T05:58:04+05:30 IST