తిరుమల, జనవరి 28 : తిరుమలకు నడక మార్గంలో దైవదర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు మృతిచెందాడు. మేడ్చల్‌కు చెందిన అశోక్(52) శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకున్నాడు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళుతుండగా మార్గమధ్యంలోని గాలి గోపురం వద్ద అశోక్ హఠాత్తుగా కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులు, తోటి భక్తులు వెంటనే అతడికి సపర్యలు చేసినప్పటికీ చలనం లేకపోవడంతో వైద్య సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అశోక్‌ను పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధా రించారు.