‘మృత్యు’ కంచెలు!

ABN , First Publish Date - 2022-09-28T06:46:47+05:30 IST

నిర్మల్‌ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పంట చేలను అడవి పందులు, వన్యప్రాణుల నుంచి కాపాడుకునేందుకు రైతులు ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ కంచెలు ప్రాణాలు తీస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడవి జంతువుల కోసం అమరుస్తున్న ఇవి రైతుల పాలిట మయపాశాలుగా మారుతున్నాయి. వారం రోజుల్లోనే జిల్లాలో ముగ్గురు రైతులు మృ తిచెందిన సంఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అయి తే సంఘటనలు జరిగినప్పుడే ఇ టు వి ద్యుత్‌.. అటు పోలీసు అధికారులు స్పందిస్తున్నారే తప్పా మిగితా సమయంలో ఈవిషయంపై రైతులకు అవగాహన కల్పించడం లేదన్న ఆరోపణలున్నాయి.

‘మృత్యు’ కంచెలు!
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు(ఫైల్‌)

చేలకు అక్రమంగా విద్యుత్‌ తీగల ఏర్పాటు 

జిల్లాలో పెరిగిపోతున్న ప్రమాదాలు 

గాలిలో కలుస్తున్న ప్రాణాలు 

వారంలోనే ముగ్గురు రైతుల మృతి

నిర్మల్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పంట చేలను అడవి పందులు, వన్యప్రాణుల నుంచి కాపాడుకునేందుకు రైతులు ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ కంచెలు ప్రాణాలు తీస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడవి జంతువుల కోసం అమరుస్తున్న ఇవి రైతుల పాలిట మయపాశాలుగా మారుతున్నాయి. వారం రోజుల్లోనే జిల్లాలో ముగ్గురు రైతులు మృ తిచెందిన సంఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అయి తే సంఘటనలు జరిగినప్పుడే ఇ టు వి ద్యుత్‌.. అటు పోలీసు అధికారులు స్పందిస్తున్నారే తప్పా మిగితా సమయంలో ఈవిషయంపై రైతులకు అవగాహన కల్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. 

జిల్లాలోని మారుమూల పల్లెల్లో ఇలా పంట చేలకు విద్యుత్‌ కంచెలు ఏర్పాటు చేయడం అలవాటుగా మారింది. కొంతమంది తమ చేల చు ట్టూ జియావైర్‌ను చుట్టి దానికి కరెంటు కనెక్షన్‌ ఇస్తున్నారు. మొన్నటి వరకు రాత్రి వేళల్లోనే ఇలా తీగలకు కనెక్షన్‌ ఇచ్చేవారు. కొద్దిరోజులుగా ఉదయం నుంచి రాత్రివేళల్లో కూడా ఈ కంచెలకు కరెంటు కనెక్షన్‌ ఇ స్తున్నారు. వీటి కారణంగా అడవి జంతువులు, వన్యప్రాణులు కరెంటు షాక్‌కు గురై మృతిచెందుతున్నారు. అయితే ఈ జంతువుల మృతివివరా లు బయటకు పొక్కకుండా సదరు రైతులు చూసుకుంటున్నారు. జంతువులను సమీప అడవుల్లో పాతి పెట్టడం లేదా దహనం చేయడం లాం టి సంఘటనలకు సైతం పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులు చేనులకు వెళ్లేందుకు మరో పంట చేనును దాటుతూ వెళుతుండగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరికి తెలియకుండా మరొకరు విద్యుత్‌ తీగలను పెన్షింగ్‌ కోసం వినియోగిస్తున్న కారణంగా ప్రమాదా లు రెట్టింపయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయంటున్నారు. చేలకు తీ గలను ఏర్పాటు చేయవద్దన్న కోణంతో అవగాహన కార్యక్రమాలు సరైన రీతిలో జరగడం లేదంటున్నారు. విద్యుత్‌, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కంచెలకు విద్యుత్‌ తీగల ఏర్పాటు చే యవద్దన్న కోణంతో విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టాల్సి ఉం దంటున్నారు. ఇలా అవగాహ న కల్పించినప్పుడే ప్రమాదా లు అరికట్టే అవకాశం ఉం టుందంటున్నారు. 

అడవి పందుల నుంచి రక్షణకే...

పంట పొలాలకు శాపంగా మారిన అడవి పందుల నుంచి ఆ పంటల రక్షణ కోసమే రైతులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు అడవి జంతువులతో పాటు మరోవైపు మనుషులు కూడా ఈ తీగలకు తగిలిప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అడవి పందులతో పాటు కోతులు కూడా ప్రస్తుతం చేలను నాశనం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలు చేతికి వచ్చే సమయంలో ఇటు అడవి పందులు ఇతర వన్యప్రాణులు, అటు కోతులు పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. పంటల రక్షణకు ప్రభుత్వ పరంగా ఎలాంటి రక్షణ లేకపోవ డం సమస్యగా మారుతోంది. కొంతమంది రైతులు గత్యంతరం లేకనే చేలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ కంచెలను ఏర్పాటు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలున్నాయి.

వారంలోనే ముగ్గురు మృతి..

అడవి జంతువుల నుంచి పం టలను కాపాడేందుకు రక్షణగా పొలాలకు చుట్టూ పెన్షింగ్‌ ఏర్పా టు చేసుకుంటున్నారు. ఈ పెన్షింగ్‌లకు ఇనుప తీగలు, జియా వైర్‌లను ఏర్పాటు చే స్తున్నారు. ఈ తీగలకు కరెంటు కనెక్షన్‌ను ఇస్తున్నారు. తీగలకు కరెంటు సరఫరా అవుతున్న సమాచారం లేని చాలా మంది అమాయక రైతులు ఆ తీగలకు తగిలి ప్రాణాలను వదులుతున్నారు. వారంరోజుల్లోనే జిలా ్లలో ముగ్గురు రైతులు మృతిచెందారు. మామడ మండలంలోని పొన్కల్‌ గ్రామానికి చెందిన  బొర్రన్న, మల్లయ్య అనే ఇద్దరు రైతులు, దిలావర్‌పూర్‌ మండలానికి చంద్రకాంత్‌ అనే బాలుడు ఇలా కరెంటు తీగలకు అంటుకొని ప్రాణాలు కోల్పోయారు. 

ఆలస్యంగా రంగంలోకి పోలీసులు..

విద్యుత్‌ కంచెల కారణంగా రైతులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. చేల వద్దకే వెళ్లి అవగాహన కల్పిస్తే ఫలితం ఉంటుందంటున్నారు. వారం రోజుల్లోనే వరుస సంఘటనలు జరిగిన కారణంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తానికి రైతులనుకంచెలు కుప్పకూలుస్తున్నాయంటున్నారు. 

రైతులు మృతిచెందిన మాట వాస్తవమే..

జేఆర్‌ చౌహన్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, నిర్మల్‌ 

వన్యప్రాణుల నుంచి పంట రక్షణ కోసం విద్యుత్‌ కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు మృతి చెందుతున్నారు. వారంరోజుల్లో ముగ్గురు రైతులు మృతిచెందిన మాట వాస్తవమే. ఇప్పటికే సోన్‌, మా మడలో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించడం జరిగింది. 


Updated Date - 2022-09-28T06:46:47+05:30 IST