సైన్యంలో చేరాలని ఆ 18 ఏళ్ల కుర్రాడి ఆశ.. కానీ ఫోన్లో మాట్లాడుతూనే తుది శ్వాస.. అసలు ఎలా మరణించాడంటే..

ABN , First Publish Date - 2022-08-26T20:28:18+05:30 IST

ఆ 18 ఏళ్ల విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు.. చదువు పూర్తి చేసి నేవీలో చేరాలనేది అతని కల..

సైన్యంలో చేరాలని ఆ 18 ఏళ్ల కుర్రాడి ఆశ.. కానీ ఫోన్లో మాట్లాడుతూనే తుది శ్వాస.. అసలు ఎలా మరణించాడంటే..

ఆ 18 ఏళ్ల విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు.. చదువు పూర్తి చేసి నేవీలో చేరాలనేది అతని కల.. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు.. రాత పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు.. ఓ అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్థులో గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నాడు.. గురువారం రాత్రి 9.30 గంటలకు అపార్ట్‌మెంట్ టెర్రస్ ఎక్కి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు.. అయితే చూసుకోకుండా చివరకు వెళ్లిపోవడంతో కింద పడిపోయి చనిపోయాడు. 


ఇది కూడా చదవండి..

ఒకే ఇంట్లో 6 మృతదేహాలు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు మేనమామ ఫోన్ చేస్తే నో రెస్పాన్స్.. ఇంటికెళ్లి చూస్తే..


మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని రాజోమా గ్రామానికి చెందిన యువరాజ్ (18) నేవీ కోచింగ్ కోసం ఇండోర్ వెళ్లాడు. అక్కడ అపార్ట్‌మెంట్‌లోని రూం అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఐదో అంతస్థులో ఉన్న టెర్రస్‌పైకి ఎక్కి మొబైల్‌లో నడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆ టెర్రస్ ఉన్న ఫ్లోర్‌కు పిట్ట గోడ లేకపోవడంతో ఘోరం సంభవించింది. యువరాజ్ చూసుకోకుండా చివరకు వెళ్లిపోవడంతో అక్కడి నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన యువరాజ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 


అక్కడ చికిత్స అందుకుంటూ అర్ధరాత్రి సమయంలో యువరాజ్ మరణించాడు. నేవీలో చేరాలనేది యువరాజ్ చిన్న నాటి కల. గత ఏడాది నర్మదా నదిపై జరిగిన అంతర్ రాష్ట్ర బోటింగ్ పోటీల్లో యువరాజ్ పాల్గొని బంగారు పతకం అందుకున్నాడు . యువరాజ్ క్రీడల్లోనూ, చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. దేశానికి సేవ చేయాలనేది అతని కల. యువరాజ్ మరణ వార్త విని అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2022-08-26T20:28:18+05:30 IST