సుబ్రహ్మణ్యం Death Certificateపై వివాదం

ABN , First Publish Date - 2022-05-26T21:09:37+05:30 IST

డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెత్ సర్టిఫికెట్ (Death Certificate)పై వివాదం నెలకొంది. హత్య కాకినాడలో జరిగితే.. డెత్ సర్టిఫికెట్ మాత్రం గొల్లలమామిడాడలో ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు

సుబ్రహ్మణ్యం Death Certificateపై వివాదం

కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెత్ సర్టిఫికెట్ (Death Certificate)పై వివాదం నెలకొంది. హత్య కాకినాడలో జరిగితే.. డెత్ సర్టిఫికెట్ మాత్రం గొల్లలమామిడాడలో ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. డెత్ సర్టిఫికేట్ కోసం పంచాయతీ సెక్రెటరీపై అధికారుల ఒత్తిడి పెంచుతున్నారు. గొల్లలమామిడాడలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు మాత్రమే నిర్వహించామని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పెదపూడి ఎమ్మార్వో 4 రోజులుగా పంచాయతీ సెక్రెటరీపై ఒత్తిడి తెస్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫికేట్ అడిగినా సెక్రటరీ ఇవ్వడం లేదని, ఆర్డీవోకి ఎమ్మార్వో లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కుట్ర కోణం దాగి ఉందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-05-26T21:09:37+05:30 IST