అంత్యక్రియలకు రాని కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2021-04-13T05:42:44+05:30 IST

తలకొరివికి పెట్టెందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. మానవత్వంతో సర్పంచే అన్ని తానై ముందుండి అంత్యక్రియలు నిర్వహించారు.

అంత్యక్రియలకు రాని కుటుంబ సభ్యులు
పాడెమోస్తున్న సర్పంచ్‌ శంకర్‌బాబు

దహన సంస్కారాలు నిర్వహించిన మర్కోడు సర్పంచ్‌ 

ఆళ్లపల్లి, ఏప్రిల్‌12: తలకొరివికి పెట్టెందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. మానవత్వంతో సర్పంచే అన్ని తానై ముందుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో మర్కోడు సోమవారం జరిగింది. సూర్యపేట జిల్లాలో కూలీపనులు దొరకకపోవడంతో అదే జిల్లా మునగాల గ్రామానికి చెందిన గురువయ్య 25 ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆళ్లపల్లి మండలం, మర్కోడులో ఒంటరిగా ఉంటున్నాడు. అప్పటికే ఆయన భార్య మృతి చెందింది. గురువయ్య(73) తాపిమేస్ర్తీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.  పాతపాఠశాలల భవనంలో ఉంటున్నాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం మృతి చెందాడు. మృతుడి సమాచారం కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపినపట్టికి వారు తాము రాలేమంటూ చెప్పారు. మీరే అంత్యక్రియలు నిర్వహించండి అని చెప్పారు. దీంతో మర్కోడు గ్రామానికి చెందిన సర్పంచ్‌ కొమరం శంకర్‌బాబు మానవత్వంతో అన్ని తానై,గ్రామస్తులు, తాపిమేస్ర్తిల సహకారంతో, దహన సంస్కరణలు నిర్వహించారు.

Updated Date - 2021-04-13T05:42:44+05:30 IST