Jul 22 2021 @ 12:07PM

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డియర్ మేఘ'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'హాయ్.. నేను మేఘ స్వరూప్. నాకు లవ్ లో పీహెడ్డీ ఉంది' అంటూ మేఘా ఆకాష్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ చూస్తుంటే చిత్రాన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో అర్జున్ సోమయాజుల మరో ప్రధాన పాత్రలో నటించాడు. సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఇటీవల విడుదల చేసిన 'ఆమని ఉంటే పక్కన' అనే లిరికల్ సినిమాపై బాగానే అంచనాలు పెంచాయి. తాజాగా వదిలిన టీజర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది.