డీలర్లు వరి సీడ్‌ విత్తనాలు విక్రయించొద్దు

ABN , First Publish Date - 2021-10-27T04:04:04+05:30 IST

జిల్లాలోని విత్తన డీలర్లు యాసంగిలో రైతులకు వరి సీడ్‌ విత్తనాలు విక్రయించొద్దని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. పట్టణంలోని జన్కాపూర్‌ రైతు వేదికలో మంగళవారం విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు

డీలర్లు వరి సీడ్‌ విత్తనాలు విక్రయించొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 26: జిల్లాలోని విత్తన డీలర్లు యాసంగిలో రైతులకు వరి సీడ్‌ విత్తనాలు విక్రయించొద్దని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. పట్టణంలోని జన్కాపూర్‌ రైతు వేదికలో  మంగళవారం విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాసంగిలో పండించిన వరి పంటలను ఎఫ్‌సీఐ ద్వారా కొనే ఆస్కారం లేదని తెలియజేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి పండించి రైతులు మద్దతు ధర లభించక నష్ట పోకూడదని ఈ చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు జిలుగ, శనగ, మినుము, పెసర, పొద్దు తిరుగుడు, వేరు శనగ పంటలను సాగు చేయాలన్నారు. జిల్లాలో  డీలర్లు ఎట్టి పరిస్థితుల్లో వరి విత్తనాలు విక్రయించొద్దని చెప్పారు. ఎవరైనా అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకంటామని, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.. సమావే శంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారులు, ఏఈవోలు, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T04:04:04+05:30 IST