అమరావతి, నవంబర్ 29(ఆంధ్రజ్యోతి): డిసెంబరులో జరిగే ఇంధన పొదుపు జాతీయ వారోత్సవాల సందర్భంగా.. ఇంధన పొదుపు కార్యక్రమాలు బాగా అమలు చేసిన వారికి అవార్డులు ఇవ్వాలని ఇంధన సంరక్షణ మిషన్ నిర్ణయించింది. దరఖాస్తులు ఏపీ ట్రాన్స్‌కో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు గడువు డిసెంబరు 7వ తేదీగా నిర్ణయించారు.