నేడే ఆఖరు!

ABN , First Publish Date - 2020-11-06T06:09:56+05:30 IST

మహబూబ్‌నగర్‌ - హైదరాబాద్‌ - రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుకు శుక్రవారం నాటితో గడువు ముగియనుంది

నేడే ఆఖరు!

పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు

ఆన్‌లైన్‌ వైపే అత్యధికుల మొగ్గు

జనవరి 18న తుది జాబితా వెల్లడి

గురువారం సాయంత్రం వరకు వచ్చిన దరఖాస్తులు

దరఖాస్తు చేసుకున్న పట్టభద్రులు : 21,663 మంది

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారు : 20,703 మంది

వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నవారు :   960 మంది


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : మహబూబ్‌నగర్‌ - హైదరాబాద్‌ - రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుకు శుక్రవారం నాటితో గడువు ముగియనుంది. గత 36 రోజులుగా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రారంభంలో నత్తనడకన కొనసాగిన  ప్రక్రియ గత కొద్ది రోజులుగా వేగం పుంజుకుంది. వికారాబాద్‌ జిల్లాలో గురువారం సాయంత్రం వరకు 21,663 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 20,703 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 960 మంది మాత్రం వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. వికారాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మొత్తం 15,003 మంది పట్టభద్రులు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆన్‌లైన్‌లో 14,766 మంది దరఖాస్తు చేసుకోగా, 237 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 6,660 మంది పట్టభద్రులు నమోదు చేసుకోగా, వారిలో 5,937 మంది ఆన్‌లైన్‌లో, 723 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. 


ఓటర్ల నమోదులో వికారాబాద్‌ ముందంజ

పట్టభద్రుల ఓటర్ల నమోదులో జిల్లాలో వికారాబాద్‌ మండలం మొదటి స్థానంలో కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు ఈ మండలంలో 4,559 మంది దరఖాస్తు చేసుకోగా,  272 మందితో కోట్‌పల్లి మండలం జిల్లాలో చివరి స్థానంలో ఉంది. ఓటుహక్కు కోసం బంట్వారం, నవాబుపేట మండలాల్లో నమోదు చేసుకున్న వారంతా ఆన్‌లైన్‌లోనే చేసుకోవడం విశేషం. బంట్వారం మండలంలో 433 మంది, నవాబుపేట మండలంలో 1,061 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ధారూరు మండలంలో 855 మంది నమోదు చేసుకోగా, వారిలో 851 మంది ఆన్‌లైన్‌లో, నలుగురు వ్యక్తిగతంగా నమోదు చేసుకున్నారు. వికారాబాద్‌ మండలంలో 4,559 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో ఆన్‌లైన్‌లో 4,479 మంది, వ్యక్తిగతంగా 80 మంది నమోదు చేసుకున్నారు. దోమ మండలంలో 967 మందికి ఆన్‌లైన్‌లో 965 మంది, ఇద్దరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. కోట్‌పల్లి మండలంలో 272 మందిలో 262 మంది ఆన్‌లైన్‌లో, 10 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు.


కులకచర్ల మండలంలో 1,396 మందిలో 1,392 మంది ఆన్‌లైన్‌లో, నలుగురు వ్యక్తిగతంగా దరఖాస్తు చేశారు. మర్పల్లి మండలంలో 769 మందిలో 767 మంది ఆన్‌లైన్‌లో, ఇద్దరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. మోమిన్‌పేట మండలంలో 923 మంది నమోదు చేసుకోగా, వారిలో ఆన్‌లైన్‌లో 919 మంది ఆన్‌లైన్‌లో, నలుగురు వ్యక్తిగతంగా నమోదు చేసుకున్నారు. పరిగి మండలంలో 2,455 మంది దరఖాస్తు చేసుకోగా, 2,414 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 41 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. పూడూరు మండలంలో 1,313 మందిలో 1,223 మంది ఆన్‌లైన్‌లో, 90 మంది వ్యక్తిగతంగా నమోదు చేసుకున్నారు. బషీరాబాద్‌ మండలంలో 518 మందిలో 456 మంది ఆన్‌లైన్‌లో, 62 మంది వ్యక్తిగతంగా, బొంరా్‌సపేట మండలంలో 797 మందిలో 616 మంది ఆన్‌లైన్‌లో, 181 మంది వ్యక్తిగతంగా, దౌల్తాబాద్‌ మండలంలో 574 మందిలో 505 మంది ఆన్‌లైన్‌లో, 69 మంది వ్యక్తిగతంగా, కొడంగల్‌ మండలంలో 806 మంది నమోదు చేసుకుంటే, వారిలో 613 మంది ఆన్‌లైన్‌లో, 193 మంది వ్యక్తిగతంగా నమోదు చేసుకున్నారు. పెద్దేముల్‌ మండలంలో 588 మందిలో ఆన్‌లైన్‌లో 570 మంది, వ ్యక్తిగతంగా, తాండూరు మండలంలో 2698 మందిలో ఆన్‌లైన్‌లో 2522 మంది, వ్యక్తిగతంగా 176 మంది దరఖాస్తు చేసుకున్నారు. యాలాల్‌ మండలంలో 679 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 655 మంది ఆన్‌లైన్‌లో, వ్యక్తిగతంగా 24 మంది నమోదు చేసుకున్నారు. 


జనవరి 18న ఓటర్ల తుది జాబితా

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు శుక్రవారం నాటితో గడువు ముగియనుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విచారణ నిర్వహించి డిసెంబరు ఒకటో తేదీన డ్రాఫ్ట్‌ ఎలకో్ట్రరల్‌ జాబితాలను ప్రదర్శించనున్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఆక్షేపణలు తెలపడానికి డిసెంబరు 31వ తేదీ వరకు అవకాశం ఉండగా, 2021, జనవరి 12వ తేదీలోగా వాటిని పరిష్కరించి అదేనెల 18వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు.

దరఖాస్తుల అందజేత

తాండూరు : టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సేకరించిన పట్టభద్రుల ఓటు దరఖాస్తులను గురువారం తాండూరు డిప్యూటీ తహసీల్దార్‌కు అందజేశారు.  ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టభద్రుల నుంచి సేకరించిన పత్రాలను అందజేసినట్లు టీఆర్‌ఎస్‌ నా యకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నహీం, పట్లోళ్ల నర్సింహులు, విజయ్‌, యువనాయకులు ఇంతియాజ్‌, బాబా, లోకేష్‌, వెంక ట్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


పట్టభద్రులు నమోదు చేసుకోండి..

కులకచర్ల: ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు శుక్రవారం ఒక్కరోజే అవకాశం ఉందని, అర్హత గల పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు తెలిపారు. గురువారం మండల పరిధిలోని ముజాహిత్‌పూర్‌లో ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చంద్రభూపాల్‌, నాయకులు వెంకటయ్య, మహమూద్‌, అంబదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-06T06:09:56+05:30 IST