కూల్‌డ్రింక్‌ ప్రియులారా బీ కేర్‌ఫుల్.. కోక్‌లో బల్లి..

ABN , First Publish Date - 2022-05-25T19:30:19+05:30 IST

అహ్మదాబాద్ : మీకు కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉందా?.. అయితే ఎందుకైనా మంచిది తాగే ముందు బాటిల్‌ లేదా సీసాను జాగ్రత్తగా పరిశీలించండి. ఎం

కూల్‌డ్రింక్‌ ప్రియులారా బీ కేర్‌ఫుల్.. కోక్‌లో బల్లి..

అహ్మదాబాద్ : మీకు కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉందా?.. అయితే ఎందుకైనా మంచిది తాగే ముందు బాటిల్‌ లేదా సీసాను జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే మీరు తాగే శీతల పానియంలో బల్లులు, కీటకాలు ఉండొచ్చు. అదృష్టం బావుండి అవి కంటపడితే పర్లదు.. లేదంటే నేరుగా మీ కడుపులోకే పోతాయ్ మరి మీ ఇష్టం.. ఇంతలా ఎందుకు హెచ్చరించాల్సి వస్తోందంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తాగుతున్న కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. గతంలో బల్లి అవశేషాలు కనిపించాయని విన్నాం.. కానీ ఈసారి ఏకంగా బల్లే కనిపించడం కూల్‌డ్రింక్ ప్రియులను  ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


నగరంలో మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లిన ఇద్దరు కస్టమర్లు కోక్ ఆర్డర్ చేశారు. ప్రశాంతంగా కూర్చుని తాగుతుండగా ఒకరి గ్లాస్‌లో బల్లి కనిపించింది. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కొన్ని క్షణాల తర్వాత షాక్ నుంచి తేరుకుని మెక్‌డొనాల్డ్ మేనేజర్‌‌కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును మేనేజర్ పెద్దగా పట్టించుకోలేదు. డబ్బులు తిరిగి చెల్లిస్తారులే అని నిర్లక్ష్యపూరిత సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరు కస్టమర్లలో ఒకరైన భార్గవ్ జోషి కూల్‌డ్రింక్‌లో బల్లి ఉన్న దృశ్యాలను వీడియో చూసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.  అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) దృష్టికి వెళ్లడంతో అధికారులు తక్షణమే స్పందించారు. మెక్‌డొనాల్డ్‌ ఔట్‌లెట్‌ను పరిశీలించి మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు మూసివేత సీల్ కూడా వేశారు. కూల్ డ్రింక్ నమూనా సేకరించి పబ్లిక్ హెల్త్ ల్యాబోరేటరికీ పంపించామని ప్రకటించారు. 



Updated Date - 2022-05-25T19:30:19+05:30 IST