గల్లంతైన మత్స్యకారుడి మృతి

ABN , First Publish Date - 2021-01-19T05:19:12+05:30 IST

నికి చెందిన పది మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బోటు బయలుదేరారు. సముద్రంలోకి కొద్ది దూరం వెళ్లిన తరువాత సత్తయ్య బోటుపై నుంచి కిందకు పడిపోయాడు. ఆయన కోసం తోటి మత్స్యకారులు గాలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘ

గల్లంతైన మత్స్యకారుడి మృతి


చోడిపల్లిపేట తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం
భోగాపురం(పూసపాటిరేగ), జనవరి 18:
చేపల వేటకు వెళ్లి సముద్రం లో గల్లంతైన ముక్కాం గ్రామానికి చెందిన ఎరుపల్లి సత్తయ్య (46) అనే మత్స్యకారుడు మృతిచెందాడు. ఆయన మృతదేహం సోమవారం చోడిపల్లిపేట తీరానికి కొట్టుకొచ్చింది. ఆదివారం వేకువజామున ముక్కాం గ్రామానికి చెందిన పది మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బోటు బయలుదేరారు. సముద్రంలోకి కొద్ది దూరం వెళ్లిన తరువాత సత్తయ్య బోటుపై నుంచి కిందకు పడిపోయాడు. ఆయన కోసం తోటి మత్స్యకారులు గాలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు సత్తయ్య ఆచూకీ కోసం తీరంలో గడిపారు. ఇంతలో సోమవారం ఉదయం చోడిపల్లిపేట తీరానికి ఒక మృత దేహం కొట్టుకొచ్చింది. కుటుంబసభ్యులు సత్తయ్య మృతదేహంగా గుర్తించారు. మృతుడికి భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ మహేష్‌ కేసు  నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-01-19T05:19:12+05:30 IST