మరో ఏనుగును బలితీసుకున్న దుండగులు.. ఈ సారి కూడా..

ABN , First Publish Date - 2020-07-03T23:40:28+05:30 IST

ఇటీవలి కాలంలో అటవీ జంతువులపై మనుషుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు ఆహారం ఎర చూపి..

మరో ఏనుగును బలితీసుకున్న దుండగులు.. ఈ సారి కూడా..

కోయంబత్తూరు: ఇటీవలి కాలంలో అటవీ జంతువులపై మనుషుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు ఆహారం ఎర చూపి బలితీసుకుంటుంటే మరికొందరు  పాశవికంగా కాల్చి చంపేస్తున్నారు. ముఖ్యంగా ఆడ ఏనుగులే లక్షంగా దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. బుల్లెట్ గాయంతో మరణించిన ఓ ఆడ ఏనుగును స్థానికులు గురువారం ఉదయం గుర్తించారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అధికారులు ఏనుగు చెవి వెనుగ భాగంలో బులెట్ గాయమైనట్లు గుర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించారు. బులెట్ గాయం కారణంగానే ఏనుగు మరణించినట్లు అందులో తేలింది. దీంతో ఏనుగు మృతదేహం లభించిన ఫార్మ్ యాజమానులు ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-07-03T23:40:28+05:30 IST