నదిలో యువకుడి శవం.. యాక్సిడెంట్ కేసుగా పోలీసుల విచారణ.. చివరకు అది యాక్సిడెంట్ కాదని తేల్చిన పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-15T05:42:26+05:30 IST

పోలీసులకు నదిలో ఇటీవల ఒక యువకుడి మృతదేహం, మృతుడి బైక్ లభించింది. ముందు యాక్సిడెంట్ కేసుగా విచారణ మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. తీగ లాగితే డొంక కదిలిందన్నట్లు అది యాక్సిడెంట్ కాదు...

నదిలో యువకుడి శవం.. యాక్సిడెంట్ కేసుగా పోలీసుల విచారణ.. చివరకు అది యాక్సిడెంట్ కాదని తేల్చిన పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే..

పోలీసులకు నదిలో ఇటీవల ఒక యువకుడి మృతదేహం, మృతుడి బైక్ లభించింది. ముందు యాక్సిడెంట్ కేసుగా విచారణ మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. తీగ లాగితే డొంక కదిలిందన్నట్లు అది యాక్సిడెంట్ కాదు.. పథకం ప్రకారం చేసిన హత్య అని పోలీసులు తేల్చారు.


వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చందర్‌పూర్ నగరంలో నివసించే రామేశ్వర్ నిషాద్ అనే యువకుడికి రెండేళ్ల క్రితం సుమన్ అనే యువతితో వివాహమైంది. కానీ వివాహం తరువాత సుమన్ పొరుగింట్లో ఉండే సూరజ్ అనే మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రామేశ్వర్ ఇంట్లో లేని సమయంలో సూరజ్, సుమన్ ఇద్దరూ కలుసుకునేవారు. ఒకరోజు అనుకోకుండా రామేశ్వర్ ఇంటికి రావడంతో భార్య వివాహేతర వ్యవహారం బయటపడింది. అయినా రామేశ్వర్ సహనంతో వ్యవహరించాడు. భార్యను తప్పుడు పనులు చేయొద్దని చెప్పాడు. అలాగే సూరజ్‌ని కూడా మరోసారి తన భార్య జోలికి రావొద్దని హెచ్చరించాడు.


ఆ తరువాత సుమన్‌కు తన ప్రియుడిని కలిసేందుకు వీలుపడేది కాదు. దీంతో తన ప్రేమకు అడ్డుగా మారిన భర్తను ఎలాగైనా అంతమొందించాలనుకుంది. ఒకరోజు తన ప్రియుడు సూరజ్‌ను రహస్యంగా కలిసి రామేశ్వర్‌ను హత్య చేయాలని చెప్పింది. ఆ తరువాత సూరజ్ తన మిత్రుడు అభిజీత్ పాండేతో కలిసి రామేశ్వర్‌ను చంపేందకు పథకం వేశాడు. పథకం ప్రకారం ఒకరోజు సాయంత్రం రామేశ్వర్‌కు సూరజ్ ఫోన్ చేశాడు. తనతో ఒకసారి మాట్లాడాలని చెప్పి ఊరి చివర ఒక ఢాబాకి పిలిచాడు. ఢాబాలో సూరజ్, రామేశ్వర్ కలిసి భోజనం చేశారు. ఆ తరువాత మద్యం సేవించి సూరజ్, రామేశ్వర్ ఒకే బైక్‌పై బయలుదేరారు. మరుసటి రోజు పోలీసులకు రామేశ్వర్ శవం నదిలో దొరికింది.


పోలీసుల విచారణలో సూరజ్ ఇదంతా ఒక యాక్సిడెంట్ అని చెప్పాడు. మద్యం మత్తులో రామేశ్వర్ బైక్ నడుపుతూ బ్రిడ్జిమీద నుంచి అదుపు తప్పి పడిపోయాడని, తాను మాత్రం సరైన సమయంలో బైక్ మీద నుంచి దూకేశానని పోలీసులకు సూరజ్ చెప్పాడు. కానీ పోలీసులకు ఎందుకో సూరజ్ మాటలు అనుమాస్పందగా అనిపించాయి. దీంతో వారు ఢాబాలో ఉన్న సీసీటీవి వీడియోని పరిశీలించారు. అందులో సూరజ్ పలుమార్లు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. పోలీసులు సూరజ్ ఫోన్ రికార్డులు పరిశీలించగా.. అతను అభిజీత్ పాండేతో మాట్లాడినట్లు తెలిసింది. పోలీసులు సూరజ్ మిత్రుడు అభిజీత్ పాండేని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అప్పుడు అభిజీత్.. సూరజ్, రామేశ్వర్ భార్య వివాహేతర సంబంధం గురించి చెప్పాడు. 


పోలీసులు సూరజ్‌ని అరెస్టు చేసి తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అతను రామేశ్వర్ హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు రామేశ్వర్ హత్య కేసులో సూరజ్, సుమన్, అభిజీత్ పాండేని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Updated Date - 2022-03-15T05:42:26+05:30 IST