Abn logo
Aug 27 2021 @ 20:51PM

దిబ్బ కాలువలోయువకుడి మృతదేహం లభ్యం

మచిలీపట్టణం: మచిలీపట్నం గరాల దిబ్బ కాలువలోకి యువకుని మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతుడిని చింతగుంటపాలెం వాసి గోళ్ల తరుణ్ కుమార్‌గా గుర్తించారు. రెండ్రోజులుగా తరుణ్ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.