ఎక్కడెక్కడి శవాలూ... ఇక్కడే పూడ్చుతున్నారు

ABN , First Publish Date - 2022-08-19T04:31:51+05:30 IST

‘ఎక్కడెక్కడియో శవాలు తీసుకోచ్చి యానాది కాలనీ వద్ద పూడ్చుతున్నారని, మా వీధుల్లో శవాలు ఊరేగింపుగా తీసుకెళుతూ ఇబ్బందులు కలిగిస్తున్నారని’ యానాది కాలనీ వాసులు తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు.

ఎక్కడెక్కడి శవాలూ... ఇక్కడే పూడ్చుతున్నారు
తహసీల్దారుకు వినతి పత్రం ఇస్తున్న యానాదికాలనీ వాసులు

 తహసీల్దారుకు యానాది కాలనీ వాసుల వినతి

ప్రొద్దుటూరు అర్బన్‌ ఆగస్టు 18: ‘ఎక్కడెక్కడియో శవాలు తీసుకోచ్చి యానాది కాలనీ వద్ద పూడ్చుతున్నారని, మా వీధుల్లో శవాలు ఊరేగింపుగా తీసుకెళుతూ ఇబ్బందులు కలిగిస్తున్నారని’ యానాది కాలనీ వాసులు తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం తహసీల్దారును కలిసి వినతి పత్రం అందజేసిన వారు మాట్లాడుతూ క్రైస్తవ సమాఽధుల తోట పేర ఒక ఫాస్టర్‌ ప్రైవేటుగా శ్మశాన వాటిక  నిర్వహిస్తూ ఎక్కడెక్కడో మరణించిన వారిని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చి సమాధులు కట్టిస్తూ వారి నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు.

వీధుల గుండా ఎక్కడెక్కడి శవాలు తీసుకెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర గ్రామాల నుంచి శవాలు తీసుకొచ్చి ఇక్కడ ఊరేగిస్తూ పూడ్చడాన్ని నిలువరించాలని కోరారు. ఇందుకు తహసీల్దారు స్పందిస్తూ ఆ ప్రాంతం వారివి కాకుండా బయటి ప్రాంతాల శవాలు అక్కడ పూడ్చడాన్ని విచారిస్తామన్నారు. ఆర్‌ఐ, వీఆర్‌ఓల ద్వారా ఫాదర్‌ను పిలిపించి ఆ శ్మశాన స్ధలం ప్రభుత్వానిదా, ప్రైవేటుదా విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలోదళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, మహిళా శక్తి అధ్యక్షురాలు లక్ష్మిదేవి యానాది కాలనీ వార్డుమెంబరు వెంకట్‌ ఆటో యూనియన్‌ నేతలు నాగేంద్ర, రసూల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:31:51+05:30 IST