24 ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు

ABN , First Publish Date - 2022-05-14T17:40:40+05:30 IST

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల అఫిలియేషన్‌లో ఉన్న 24 ప్రైవేట్‌ కళాశాలల(Private colleges) గుర్తింపును 2021-22కి సంబంధించి ఉన్నత విద్యామండలి(Higher education) రద్దు చేసింది. అదేవిధంగా 354 కోర్సుల గుర్తింపునూ..

24 ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల అఫిలియేషన్‌లో ఉన్న 24 ప్రైవేట్‌ కళాశాలల(Private colleges) గుర్తింపును 2021-22కి సంబంధించి ఉన్నత విద్యామండలి(Higher education) రద్దు చేసింది. అదేవిధంగా 354 కోర్సుల గుర్తింపునూ రద్దుచేసింది. మూడేళ్లుగా కళాశాలల అఫిలియేషన్‌ను పునరుద్ధరించుకోని 42కళాశాలలు, అడ్మిషన్లు కాని పలు కోర్సులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని గతంలో ఉన్నత విద్యామండలి నోటీసులు ఇచ్చింది. దీనిపై వచ్చిన రాతపూర్వక వివరణలను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించి.. నివేదిక ఆధారంగా 10విశ్వవిద్యాలయాల పరిధిలోని 24కళాశాలల గుర్తింపును, 354కోర్సుల గుర్తింపును రద్దుచేశారు. 

Read more