Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 01 Apr 2022 04:10:28 IST

210 .. సరిపోలేదు

twitter-iconwatsapp-iconfb-icon
210 .. సరిపోలేదు

చెన్నైకి రెండో పరాజయం జూ భారీ ఛేదనలో లఖ్‌నవూ గెలుపు

చెలరేగిన డికాక్‌, లూయిస్‌


ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు (171) తీసిన బౌలర్‌గా డ్వేన్‌ బ్రావో. మలింగ (170)ను దాటేశాడు.

టీ20ల్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత క్రికెటర్‌గా ఎంఎస్‌ ధోనీ. 


ముంబై: ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటిసారిగా తమ ఆరం భ రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా బౌలింగ్‌ వైఫల్యంతో ఆరు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. అటు డికాక్‌ (61), లూయిస్‌ (55 నాటౌట్‌) మెరుపులతో లఖ్‌నవూ గెలుపు బోణీ చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. రాబిన్‌ ఊతప్ప (50), దూబే (49), మొయిన్‌ అలీ (35) రాణించారు. చివర్లో ధోనీ (16 నాటౌట్‌) మెరిశాడు. బిష్ణోయ్‌, అవేశ్‌, టైలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసి గెలిచింది. చివర్లో హుడా (13), బదోని (19 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రిటోరియ్‌సకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా లూయిస్‌ నిలిచాడు. 

210 .. సరిపోలేదు

ఛేదన ధాటిగా..

211 పరుగుల భారీ ఛేదనలో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ధాటిగా సాగింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఓపెనర్లు రాహుల్‌, డికాక్‌ పోటాపోటీ బౌండరీలతో హోరెత్తించారు. ఓవర్‌కు పది రన్‌రేట్‌తో దూసుకెళ్లడంతో 10 ఓవర్లలోనే 98 పరుగులు సాధించింది. ఈ దశలో లఖ్‌నవూ తడబడింది. వరుస ఓవర్లలో రాహుల్‌, పాండే (5) వికెట్లను కోల్పోగా, కుదురుకున్న డికాక్‌ 15వ ఓవర్‌లో వెనుదిరిగాడు. అయితే లూయిస్‌ మాత్రం మరో ఎండ్‌లో భారీ షాట్లతో ఆశలు రేపాడు. 18 బంతుల్లో 46 రన్స్‌ కావాల్సిన దశలో హుడా బ్రావో ఫుల్‌టాస్‌ బంతికి క్యాచ్‌ అవుటయ్యాడు. దూబే వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో ఏకంగా 25 పరుగులు రావడంతో చెన్నై ఆశలు వదులుకుంది. మరో 9 రన్స్‌ 3బంతుల్లోనే రావడంతో రాహుల్‌ సేన సంబరాల్లో మునిగింది. 

210 .. సరిపోలేదు

మెరుపు ఆరంభం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ రుతురాజ్‌ (1) వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప, మొయిన్‌ అలీ చెలరేగడంతో పవర్‌ప్లేలోనే జట్టు 73 పరుగులు సాధించింది. అయితే స్పిన్నర్‌ బిష్ణోయ్‌ మాత్రం గూగ్లీ బాల్స్‌తో పరుగులను కట్టడి చేస్తూ ఈ జోడీని విడదీశాడు. 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసిన ఊతప్పను ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం శివమ్‌ దూబే బాధ్యత తీసుకున్నాడు. ఈ దశలో అలీని అవేశ్‌ బౌల్డ్‌ చేశాడు. మరోవైపు ఉన్న కాసేపు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో బ్యాట్‌ను ఝుళిపించిన రాయుడు (27) 17వ ఓవర్‌లో బిష్ణోయ్‌ చేతిలో బౌల్డయ్యాడు. కాసేపటికే జోరు మీదున్న దూబే భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ అవుటైనా.. ధోనీ (16 నాటౌట్‌) వచ్చీ రాగానే 6,4తో ఫామ్‌ చాటుకున్నాడు. చివరి ఓవర్‌లో జడేజా (17), ప్రిటోరియస్‌ (0) అవుటైనా ఆఖరి బంతిని ధోనీ ఫోర్‌గా మలిచాడు.


స్కోరుబోర్డు

చెన్నై సూపర్‌ కింగ్స్‌:


ఊతప్ప (ఎల్బీ) బిష్ణోయ్‌ 50; రుతురాజ్‌ (రనౌట్‌) 1; మొయిన్‌ అలీ (బి) అవేశ్‌ 35; దూబే (సి) లూయిస్‌ (బి) అవేశ్‌ 49; రాయుడు (బి) బిష్ణోయ్‌ 27; జడేజా (సి) పాండే (బి) ఆండ్రూ టై 17; ధోనీ (నాటౌట్‌) 16; ప్రిటోరియస్‌ (ఎల్బీ) టై 0; బ్రావో (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 210/7. వికెట్ల పతనం: 1-28, 2-84, 3-106, 4-166, 5-189, 6-203, 7-203. బౌలింగ్‌: అవేశ్‌ ఖాన్‌ 4-0-38-2; చమీర 4-0-49-0; ఆండ్రూ టై 4-0-41-2; క్రునాల్‌ 3-0-35-0; బిష్ణోయ్‌ 4-0-24-2; హుడా 1-0-12-0.


లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌:

రాహుల్‌ (సి) రాయుడు (బి) ప్రిటోరియస్‌ 40; డికాక్‌ (సి) ధోనీ (బి) ప్రిటోరియస్‌ 61; మనీశ్‌ పాండే (సి) బ్రావో (బి) తుషార్‌ 5; లూయిస్‌ (నాటౌట్‌) 55; హుడా (సి) జడేజా (బి) బ్రావో 13; బదోని (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 19.3 ఓవర్లలో 211/4. వికెట్ల పతనం: 1-99, 2-106, 3-139, 4-171. బౌలింగ్‌: ముకేశ్‌ 3.3-0-39-0; తుషార్‌ 4-0-40-1; బ్రావో 4-0-35-1; జడేజా 2-0-21-0; మొయిన్‌ అలీ 1-0-14-0; ప్రిటోరియస్‌ 4-0-31-2; దూబే 1-0-25-0.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.