ఈ మధ్యకాలంలో అత్యధికంగా చూసిన టీవీ ఛానల్ ఏంటంటే..

ABN , First Publish Date - 2020-04-10T03:05:16+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం దేశవ్యాప్తంగా

ఈ మధ్యకాలంలో అత్యధికంగా చూసిన టీవీ ఛానల్ ఏంటంటే..

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలపై పడింది. ముఖ్యంగా లాక్‌డౌన్ కారణంగా సినిమాలతో పాటు.. సీరియల్స్ షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. దీంతో ఆయా ఛానల్స్ తమ పాత సీరియల్స్‌నే రీ టెలికాస్ట్ చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో దూర్‌దర్శన్(డీడీ నేషనల్).. అందులో ప్రసారమైన ‘రామాయణ్’ సీరియల్‌ని రీ టెలికాస్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆ ఛానల్‌ని చూసేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.


చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ ‘రామాయణ్’ సీరియల్‌ని ఎంతో ఇష్టంగా చూడటంతో.. ఆ ఛానల్ వ్యూయర్‌షిప్ ఏకంగా 40 వేల రేట్లకు పెరిగిపోయిందని బ్రాడ్‌క్యాస్ట్ అడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ) తాజా నివేదికలో వెల్లడించింది. అంతేకాక.. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీల మధ్యకాలంలో డీడీ నేషనల్ అత్యధికంగా చూసిన ఛానల్‌గా నిలిచిందని పేర్కొంది. ‘రామాయణ్‌’తో పాటు.. ఆ ఛానల్‌లో అప్పట్లో ఆ ఛానల్‌లో ప్రసారమైన పాత సీరియల్స్‌ శక్తిమాన్, బ్యోమకేశ్ భక్షి, మౌగ్లీ తదితర సీరియల్స్‌ను మళ్లీ టెలికాస్ట్ చేసే యోచనలో డీడీ నేషనల్ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2020-04-10T03:05:16+05:30 IST