బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు విజయవాడ DCP వార్నింగ్

ABN , First Publish Date - 2022-07-06T17:44:57+05:30 IST

నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు డీసీపీ విశాల్ గున్ని వార్నింగ్ ఇచ్చారు.

బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు విజయవాడ DCP వార్నింగ్

విజయవాడ: నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్ (Bar and Restaurant) యజమానులకు డీసీపీ(DCP) విశాల్ గున్ని(Vishal gunni) వార్నింగ్ ఇచ్చారు. రాత్రి 11 గంటల తరువాత బార్, రెస్టారెంట్లు తెరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం బార్ అండ్ రెస్టారెంట్ యజమానులతో డీసీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో ఇటీవల జరిగిన అన్ని ఘటనలు బార్ అండ్ రెస్టారెంట్స్ నుంచే జరిగాయని తెలిపారు. బార్ అండ్ రెస్టారెంట్స్ పరిధిలో నేరాలు జరిగితే బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. బార్ యాజమాన్యాలు ఐపి బేస్డ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చెయాలని డిమాండ్ చేశారు. ఎక్కువ క్రైమ్ ప్లానింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌లలో జరుగుతుందని తెలిపారు. ఎన్డీపీ లిక్కర్ అమ్మినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పరస్పర సహకార ఉండాలనే ఈ సమావేశం ఏర్పాటు చేశామని డీసీపీ విశాల్ గున్ని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-06T17:44:57+05:30 IST