గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

ABN , First Publish Date - 2022-07-03T06:10:18+05:30 IST

గవర్నర్‌పేట పోలిస్‌స్టేషన్‌ను శనివారం ఈస్ట్‌జోన్‌ డీసీపీ విశాల్‌గున్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ 

వన్‌టౌన్‌, జూలై 2: గవర్నర్‌పేట పోలిస్‌స్టేషన్‌ను శనివారం ఈస్ట్‌జోన్‌ డీసీపీ విశాల్‌గున్ని ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన రికార్డ్‌లను తనిఖీ చేసి పెండింగ్‌లో ఉన్న కేసుల  వివరాలను తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించాలని స్టేషన్‌ అధికారులకు సూచించారు. అనంతరం పోలిస్‌స్టేషన్‌ రికార్డ్‌లను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు, ఫిర్యాదులకు సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కు అప్రిషియేషన్‌ లెటర్‌ను డీసీపీ విశాల్‌గున్ని అందజేశారు.

Updated Date - 2022-07-03T06:10:18+05:30 IST