సమన్వయంతో నేరాలను అదుపులోకి తెచ్చిన డీసీపీ(అడ్మిన్‌)

ABN , First Publish Date - 2021-12-01T06:09:00+05:30 IST

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలను సమన్వయంతో డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ అదుపులోకి తీసుకువచ్చారని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

సమన్వయంతో నేరాలను అదుపులోకి తెచ్చిన డీసీపీ(అడ్మిన్‌)
డీసీపీ (అడ్మిన్‌) అశోక్‌ కుమార్‌ను సన్మానిస్తున్న సీపీ

-  సీపీ చంద్రశేఖర్‌రెడ్డి 

కోల్‌సిటీ, నవంబరు 30:రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలను సమన్వయంతో డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ అదుపులోకి తీసుకువచ్చారని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ డీజీపీ ఆఫీస్‌కు బదిలీపై వెళుతున్న అశోక్‌కుమార్‌ను సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేరాలు, వర్టికల్‌ ట్రై నింగ్స్‌, సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అడ్మినిస్ర్టేషన్‌ విషయంలో ముందుండేలాగా డీసీపీ కృషి చేశారని, సీపీఓ సిబ్బంది సమన్వయంతో సర్వీస్‌ సమస్య లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించి కమిషనరేట్‌లో అందరి మన్ననలు పొందారని, కిందిస్థాయి సిబ్బందికి అన్నీ వేళలా అండగా నిలిచారని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా క్రమశిక్షణ, నిబద్దతతో విధులు నిర్వహిస్తూ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. అడ్మిన్‌ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ మూడు సంవత్సరాలకుపైగా కమిషనరేట్‌లో పని చేసిన తనకు ఇక్కడ నేర్చుకున్న పని భవిష్యత్‌లో ఎంతో  ఉపయోగపడుతుందని, కమిషనరేట్‌లో సిబ్బంది తనకు సహకరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు రవీందర్‌, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఓఎస్‌డీ శరత్‌చంద్రపవర్‌, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్‌, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌రావు, ఇన్‌స్పెక్టర్లు కమలాకర్‌, వెంకటేశ్వర్లు, ముత్తిలింగయ్య, ప్రతాప్‌, ప్రవీణ్‌కుమార్‌, నరేందర్‌, విద్యాసాగర్‌, పోలీస్‌ సంఘం అధ్యక్షుడు బోర్లకుంట్ల పోచం, ఏవో నాగమణి, ఆర్‌ఐలు మధుకర్‌, విష్ణు ప్రసాద్‌, అంజన్న, శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T06:09:00+05:30 IST