ఫంక్షనల్‌ వర్టికల్స్‌ పనితీరుపై డీసీపీ(అడ్మిన్‌) తనిఖీ

ABN , First Publish Date - 2021-08-02T06:00:36+05:30 IST

ఎన్‌టీపీసీ పోలీస్‌ స్టేషన్‌ను ఆదివారం కమిషనరేట్‌ డీసీపీ (అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ తనిఖీ చేశారు.

ఫంక్షనల్‌ వర్టికల్స్‌ పనితీరుపై డీసీపీ(అడ్మిన్‌) తనిఖీ
పోలీస్‌స్టేషన్‌లో తనిఖీ చేస్తున్న డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌

జ్యోతినగర్‌, ఆగస్టు 1: ఎన్‌టీపీసీ పోలీస్‌ స్టేషన్‌ను ఆదివారం కమిషనరేట్‌ డీసీపీ (అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ తనిఖీ చేశారు. డీజీపీ మహేందర్‌రె డ్డి రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తున్న 17 వర్టికల్స్‌ ఫంక్షనింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అ మలు విధానంపై పరిశీలించారు. రిసెప్షన్‌, బ్లూ కోల్ట్‌, క్రైమ్‌ టీమ్‌, కోర్ట్‌ డ్యూటీ ఆఫీసర్‌, స్టేషన్‌ రైటర్‌, క్రైమ్‌ రైటర్‌, ప్రాసెస్‌, సమన్స్‌, వారెంట్స్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఇన్‌చార్జి, టెక్‌ టీం, ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌, ఎస్‌హెచ్‌ఓ వర్టికల్స్‌ పని తీరు ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 5ఎస్‌ విధానం అమలుతీరు ను తనిఖీ చేసి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని టుటౌన్‌ సీఐ శ్రీనివాసరావు, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ స్వ రూప్‌రాజ్‌, ట్రైనీ ఎస్‌ఐ రాజశేఖర్‌, ఐటీ కోర్‌ సిబ్బంది కశెట్టి రాము, రహీం, సీసీ గౌస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T06:00:36+05:30 IST