సొసైటీలకు ఎరువులు కేటాయించండి

ABN , First Publish Date - 2021-09-29T05:29:51+05:30 IST

జిల్లాలో వ్యాపారులు ఎరువులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.. సొసైటీలకు ఎరువులు కేటాయించటం లేదు... రైతులకు మేమ సమాధానం చెప్పలేకపోతున్నాం అంటూ పలువుర సొసైటీ సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు.

సొసైటీలకు ఎరువులు కేటాయించండి
సమావేశంలో ప్రసంగిస్తున్న లాలుపురం రాము

డీసీఎంఎస్‌ సమావేశంలో సొసైౖటీ అధ్యక్షులు

గుంటూరు, సెప్టెంబరు28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యాపారులు ఎరువులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.. సొసైటీలకు ఎరువులు కేటాయించటం లేదు... రైతులకు మేమ సమాధానం చెప్పలేకపోతున్నాం అంటూ పలువుర సొసైటీ సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం డీసీఎంఎస్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.  సొసైటీ అధ్యక్షులు బాజి గంగాధరరావు, ఆర్‌.సుబ్బారెడ్డి, బి.కోటిరెడ్డి, బి.సుధాకర్‌లు మాట్లాడుతూ గతంలో సొసైటీలకు 50 శాతం ఎరువులు కేటాయించగా, ఇప్పుడు ఇవ్వటం లేదన్నారు. దీంతో బ్లాక్‌ మార్కెట్‌ పెరిగిందన్నారు. మల్లెల హరేంద్రనాథచౌదరి మాట్లాడుతూ  డీసీఎంఎస్‌లో  సిబ్బందిని పెంచాలని సూచించారు. రైతుసలహా కమిటీ చైర్మన వై.మదన మాట్లాడుతూ ఎరు వుల కేటాయింపుల్లో సహకార సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  డీసీసబీ చైర్మన రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాల్‌పురంరాము) మాట్లాడుతూ సొసైటీలకు ఎరువుల కేటాయింపులపై వ్యవసాయశాఖ అధికారులతో చర్చిస్తామన్నారు. చైర్మన యార్లగడ్డ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలకవర్గసభ్యులు కుర్రాపాములు, క్రిష్ణారెడ్డి, పి.వెంకటశివ, బాలగురవమ్మ, ఆదినారాయణ, దాసరి రాజు, డీసీసీబీ పాలకవర్గ సభ్యులు కోటా హరిబాబు, పి.వెంకటేశ్వరరావు, జీఎం హరగోపాల్‌, బిజినెస్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, ఇఫ్‌కో జిల్లా మేనేజర్‌ రఘు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T05:29:51+05:30 IST