జిల్లా ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్‌ విచారణ

ABN , First Publish Date - 2022-07-01T05:27:31+05:30 IST

సదరం సర్టిఫికెట్‌ జారీలో జరిగి న మోసంపై వైద్యవిధాన పరిషత్తు ఉన్నతాధికారుల అదేశాల తో గురువారం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హిమదేవి ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో విచారణ చేపట్టారు.

జిల్లా ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్‌ విచారణ
వైద్యాధికారులను విచారిస్తున్న డీసీహెచ్‌ఎస్‌

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 30: సదరం సర్టిఫికెట్‌ జారీలో జరిగి న మోసంపై వైద్యవిధాన పరిషత్తు ఉన్నతాధికారుల అదేశాల తో గురువారం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హిమదేవి ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఆర్ధో విభాగాన్ని పరిశీలించిన ఆమె రోగులకు వైద్యుడు అందించే సేవలను గమనించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే రోగులను పరీక్షించి, చికిత్స అందించాలని వైద్యున్ని అదేశించారు. ఆర్ధో వైద్యుడి లాగిన్‌లోకి వెళ్లిన ఇద్దరు వైద్యులు ఓమహిళకు సదరం సర్టిఫికెట్‌ ఇచ్చే ప్రయత్నంలో అధికారులకు ఫిర్యాదు చేయగా,  విచారించి వారిని సస్పెండ్‌ చేశారు. ఇదే ఘటనపై వైద్యవిధా న పరిషత్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన విచారణ నివేదికను డీసీహెచ్‌ఎస్‌ ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ సెల్వరాజ్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఆనంద్‌బాబు తదితరులున్నారు. 

Updated Date - 2022-07-01T05:27:31+05:30 IST