డీసీహెచ్‌ఎల్‌ పరిష్కార ప్రణాళిక నిలిపివేత

ABN , First Publish Date - 2022-01-25T08:16:13+05:30 IST

దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) పరిష్కార ప్రక్రియ మళ్లీ చిక్కుల్లో పడింది. విజన్‌ ఇండియా ఫండ్‌-శ్రేయీ మల్టిపుల్‌ అసెట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ సమర్పించిన పరిష్కార ప్రణాళికను ఎన్‌సీఎల్‌ఏటీ కొట్టివేసింది. ...

డీసీహెచ్‌ఎల్‌ పరిష్కార ప్రణాళిక నిలిపివేత

చెల్లుబాటు కాదని  ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు

న్యూఢిల్లీ : దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) పరిష్కార ప్రక్రియ మళ్లీ చిక్కుల్లో పడింది. విజన్‌ ఇండియా ఫండ్‌-శ్రేయీ మల్టిపుల్‌ అసెట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ సమర్పించిన పరిష్కార ప్రణాళికను ఎన్‌సీఎల్‌ఏటీ కొట్టివేసింది. నిధుల కేటాయింపులో క్రెడిటార్ల మధ్య ‘‘వివక్ష’’ కనిపిస్తున్నందు వల్ల దీన్ని ఆమోదించడం సాధ్యం కాదని ప్రకటించింది. 2019 జూన్‌ 3వ తేదీన హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీకి చెందిన ఇద్దరు సభ్యుల బెంచ్‌ బిడ్‌ను అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వు ‘‘చట్టం ముందు నిలవదు’’ అని స్పష్టం చేసింది. ఫలితంగా ఈ వ్యవహారం తిరిగి డీసీహెచ్‌ఎల్‌ క్రెడిటార్ల కమిటీ (సీఓసీ) ముందుకు వచ్చింది. ఐబీబీఐ (కార్పొరేట్‌ వ్యక్తుల ఇన్‌సాల్వెన్సీ రిజొల్యూషన్‌ ప్రాసెస్‌) నిబంధనలు, 2016కి అనుగుణంగా ‘‘పరిష్కార మొత్తాన్ని పంపిణీ చేయాల’’ని సీఓసీని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఐడీబీఐ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన అనంతరం ఎన్‌సీఎల్‌ఏటీ ఈ తీర్పు ప్రకటించింది. ఆ పరిష్కార ప్రణాళిక ప్రకారం ఫైనాన్షియల్‌ క్రెడిటార్లందరికీ రూ.350 కోట్లు నగదుగా చెల్లిస్తారు. అయితే మొత్తం 37 మంది ఫైనాన్షియల్‌ క్రెడిటార్లు చేసిన క్లెయిమ్‌ల మొత్తం రూ.8,180 కోట్లు. కెనరా బ్యాంక్‌ అభ్యర్థన మేరకు దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌పై ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభమైంది. 2018 జూన్‌ 14వ తేదీన 12వ సీఓసీ సమావేశంలో శ్రేయీ మల్టిపుల్‌ అసెట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ను గరిష్ఠ బిడ్డర్‌గా ప్రకటించారు. అయితే సెటిల్మెంట్‌లో భాగంగా తమకు ఇవ్వజూపిన మొత్తం ఆమోదనీ యం కాదంటూ ఐడీబీఐ బ్యాంక్‌ ఆ బిడ్‌ను వ్యతిరేకించింది. 


కెనరా బ్యాంక్‌ ప్రో-రేటా (నైష్పత్తిక) వాటా 10.11 శాతం కాగా ఆమోదించిన క్లెయిమ్‌ల మొత్తం 34.96 శాతమని, అదే తమకు అనుమతించిన క్లెయిమ్‌ల వాటా 6.71 శాతం ఉండగా చెల్లింపజూపిన మొత్తం కేవలం 3.92 శాతమని ఐడీబీఐ బ్యాంక్‌ వాదించింది. ఐడీబీఐ బ్యాంక్‌ అనుమతించిన క్లెయిమ్‌ల మొత్తం రూ.549.08 కోట్లు. అయితే ఫైనాన్షియల్‌ క్రెడిటార్లకు ఇవ్వజూపిన మొత్తంలో ఎలాంటి వివక్ష లేదంటూ ఐడీబీఐ బ్యాంక్‌ అభ్యర్థనను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. ఫలితంగా ఐడీబీఐ బ్యాంక్‌ ఆ తీర్పుపై ఎన్‌సీఎల్‌ఏటీలో సవాలు చేసింది. 

Updated Date - 2022-01-25T08:16:13+05:30 IST