Abn logo
Feb 22 2020 @ 03:03AM

రిజర్వేషన్లు సరే.. అభ్యర్థులేరీ?

డీసీసీబీలో ఖాళీగా ఎస్సీ, ఎస్టీ డైరెక్టర్‌ పదవులు


మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): డీసీసీబీ, డీసీఎంఎ్‌సలలో మొదటిసారిగా డైరెక్టర్‌ పదవులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. వాటిలో ఎస్సీ, ఎస్టీల కు కేటాయించిన పదవులకు అభ్యర్థులు కరువయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీసీబీలో ఉన్న మొత్తం 20 డైరెక్టర్‌ పదవుల్లో 16 పదవులు ‘ఏ’ కేటగిరీ (స హకార సంఘాల చైర్మన్లు)కి, 4 పదవులు ‘బీ’ కేటగిరీ (కుల, వృత్తి సంఘాల చైర్మన్లు)కి కేటాయించారు. ఏ కేటగిరీ రిజర్వేషన్లలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, బీసీలకు 2 కేటాయించారు. అయితే డీసీసీబీ పరిధిలో ఒక్క ఎస్సీ, ఎస్టీ కూడా సొసైటీ చైర్మన్‌గా ఎన్నిక కాలేదు. దీంతో ఆ వర్గాలకు కేటాయించిన నాలుగు డైరెక్టర్‌ పదవులూ ఖాళీగానే ఉండిపోనున్నాయి. ఇక ‘బీ’ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీలకు చెరో డైరెక్టర్‌ పదవి కేటాయించగా.. ఎస్టీ పదవికి మాత్రమే అభ్యర్థి ఉన్నారు. ఎస్సీ డైరెక్టర్‌ పదవి ఖాళీగానే ఉండబోతోంది. డీసీఎంఎ్‌సలోనూ ఇదే పరిస్థితి. మొత్తంగా మహబూబ్‌నగర్‌ డీసీసీబీ, డీసీఎంఎ్‌సలలో ఎస్సీ, ఎస్టీలకు 9 డైరెక్టర్‌ పదవులు కేటాయించగా.. 8 డైరెక్టర్‌ పదవులు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండబోతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement