ముమ్మరంగా రుణాల రికవరీ

ABN , First Publish Date - 2022-06-30T05:46:23+05:30 IST

ప్రత్తిపాడు, జూన్‌ 29: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాఽథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు రుణాల రికవరీ ముమ్మరం చేయాలని డీసీసీబీ డీజీఎం ఎం.శ్రీధర్‌ చౌదరి సూచించారు. మండలంలోని ధర్మవరం పీఏసీఎ్‌సను బుధవా

ముమ్మరంగా రుణాల రికవరీ

డీసీసీబీ డీజీఎం శ్రీధర్‌ చౌదరి  

ప్రత్తిపాడు, జూన్‌ 29: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాఽథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు రుణాల రికవరీ ముమ్మరం చేయాలని డీసీసీబీ డీజీఎం ఎం.శ్రీధర్‌ చౌదరి సూచించారు. మండలంలోని ధర్మవరం పీఏసీఎ్‌సను బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. డీజీఎం మాట్లాడుతూ పీఏసీఎ్‌సలో ఎన్‌పీఎ 5.6శాతం ఉం దని దీన్ని 5శాతానికి తీసుకొచ్చే విధంగా జిల్లావ్యాప్తంగా రికవరీలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ధర్మవరం సొసైటీపరిధిలో రెండేళ్లుగా రికవరీలు లేవని, ప్రస్తుతం ఈ సొసైటీ పరిధిలో రుణాల రికవరీలు వేగవంతమయ్యాయని తెలిపా రు. ప్రత్తిపాడు బ్రాంచ్‌ మేనేజర్‌ ఎస్‌ఏ నాయుడు, డీసీసీబీ కాకినాడ సీసీ ఎం.నాగేశ్వరరావు, స్థానిక సొసైటీ సిబ్బంది డీవీ సూర్యం, బోడా రాజు, డి.శివ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-30T05:46:23+05:30 IST