అల్లూరి పార్కుకు డీసీసీబీ రెండు ఏసీలు వితరణ

ABN , First Publish Date - 2022-07-06T07:04:22+05:30 IST

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కుకు రెండు ఏసీలను డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైసీపీ నాయకుడు సీహెచ్‌. సన్యాసిపాత్రుడు మంగళవారం స్థానిక సర్పంచ్‌ లోచల సుజాతకు అందజేశారు.

అల్లూరి పార్కుకు డీసీసీబీ రెండు ఏసీలు వితరణ
కృష్ణాదేవిపేట పార్కుకు ఏసీలను అందిస్తున్న డీసీసీబీ చైర్‌పర్శన్‌ చింతకాయల అనిత



కృష్ణాదేవిపేట, జూలై 5: గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కుకు రెండు ఏసీలను డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైసీపీ నాయకుడు సీహెచ్‌. సన్యాసిపాత్రుడు మంగళవారం స్థానిక సర్పంచ్‌ లోచల సుజాతకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు ఏసీలను బ్యాంకు తరపున అందించామన్నారు. వీటిని పార్కుకు వచ్చే పర్యాటకులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు చింతల బుల్లిప్రసాద్‌, చింతల మనోజ్‌, సహకార బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T07:04:22+05:30 IST