Abn logo
Jul 24 2021 @ 00:00AM

మాది రైతు ప్రభుత్వం

డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజుకు సన్మానం

  జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని నాని

  డీసీసీబీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

ఏలూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభు త్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో శనివారం జరిగిన డీసీసీబీ చైర్మన్‌, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్య క్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్మన్‌గా నియమితులైన పీవీఎల్‌ నరసింహరాజు, సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతుల సంక్షే మానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఎంతోమంది ప్రముఖులు చైర్మన్లుగా సేవలందించారన్నారు. నరసింహరాజు రైతులకు సేవలందించి గు ర్తింపు తీసుకురావాలన్నారు. మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనిత మా ట్లాడుతూ రైతులకు డీసీసీబీ అండగా నిలవాలన్నారు. తొలుత డీసీసీ చైర్మన్‌ పీవీఎల్‌, ఆరుగురు పాలకవర్గ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.