పేదలకు అండగా డీసీబీఎల్

ABN , First Publish Date - 2020-10-12T02:52:09+05:30 IST

స్థానికంగా నివసిస్తున్న ప్రజల కోసం దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ సంస్థ ఎన్నో పథకాలను అందిస్తోంది. వారికి జీవనోపాధిని మెరుగు పరిచేందుకు..

పేదలకు అండగా డీసీబీఎల్

కడప: స్థానికంగా నివసిస్తున్న ప్రజల కోసం దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ సంస్థ ఎన్నో పథకాలను అందిస్తోంది. వారికి  జీవనోపాధిని మెరుగు పరిచేందుకు అనేక మార్గదర్శకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తన సీఎస్ఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ.7 కోట్ల వరకూ ఖర్చు పెట్టింది. ఈ నిధులతో స్థానికులకు కావలసిన నీరు, విద్యుత్ సౌకర్యాలను అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. అంతేకాకుండా పలు వృత్తి విద్యా కోర్సుల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణను అందిస్తోంది. ప్రతిక్షణం స్థానిక ప్రజల బాగోగుల గురించి ఆలోచించే డీసీబీఎల్.. ఇప్పటికే చుటుపక్కల ప్రాంతాల్లో ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ఆరోగ్యం, విద్య వంటి సదుపాయాలు కల్పించి గామీణాభివృద్దికి తోడ్పడుతోంది. అలాగే మహిళలను చైతన్యవంతం చేసేందుకు, వారిని అభ్యున్నతి వైపు నడిపించేందుకు ఎంతగానో కృషి చేస్తోంది.


ఎన్నో నీటి ట్యాంక్‌లను, ఆర్ఓ ప్లాంట్‌లను కట్టించడం ద్వారా స్థానిక తాగు నీటి అవసరాలను తీర్చింది. అలాగే వాన నీటిని నిల్వ చేసుకునేందుకు 20 ఇంకుడు గుంతలను, 120పైగా వ్యవసాయ చెరువులను, 4 చెక్ డ్యాంలను నిర్మించింది. స్థానిక పాఠశాలను అభివృద్ది చేసింది. విద్యార్ధులకు కావలసిన స్కాలర్‌షిప్‌లను అందించింది. విద్యతోపాటు క్రీడల్లో కూడా యువతను ప్రోత్సహించింది. అంతేకాకుండా ఎన్నో ఉపాధి పథకాలు కూడా ప్రవేశపెట్టి అక్కడి వారికి జీవనోపాధి కల్పించింది.

Updated Date - 2020-10-12T02:52:09+05:30 IST