భీమిలిలో పట్టపగలు చోరీ

ABN , First Publish Date - 2022-05-21T05:38:14+05:30 IST

స్థానిక చిన్నబజారు జంక్షన్‌లో శుక్రవారం పట్టపగలు చోరీ జరిగింది. గుర్తుతెలియన దుండగుడు మెడికల్‌ స్టోర్‌లో క్యాష్‌ బాక్స్‌ తస్కరించాడు. గురువారం సాయంత్రం జరిగిన ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భీమిలిలో పట్టపగలు చోరీ
క్యాష్‌ బాక్స్‌తో వెళ్తున్న దుండగుడు

మెడికల్‌ షాప్‌లో క్యాష్‌బాక్స్‌ ఎత్తుకుపోయిన దుండగుడు

భీమునిపట్నం, మే 20: స్థానిక చిన్నబజారు జంక్షన్‌లో శుక్రవారం పట్టపగలు చోరీ జరిగింది.  గుర్తుతెలియన దుండగుడు మెడికల్‌ స్టోర్‌లో క్యాష్‌ బాక్స్‌ తస్కరించాడు. గురువారం సాయంత్రం జరిగిన ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నబజారులో ములగల త్రినాథ అప్పలరాజు సాయితులసి మెడికల్స్‌ దుకాణ యజమాని. గురువారం సాయంత్రం అయిదు గంటలప్రాంతంలో మధురవాడకు చెందిన తన స్నేహితుడికి అద్దె ఇలక్షౌ చూపించేందుకు దుకాణం నుంచి బయటకు వెళ్లాడు. అదే అదనుగా దుండగుడు క్యాష్‌బాక్స్‌ను ఎత్తుకుపోయాడు. తిరిగి వచ్చిన తరువాత పరిశీలించి, చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పరిశీలించారు. మరో దుకాణంలోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా 20 ఏళ్ల లోపున్న వ్యక్తి దుకాణంలోకి వెళ్లి క్యాష్‌ బాక్స్‌ను విరగ్గొట్టి కాలేజీ రోడ్డులో వెళ్లినట్టు తేలింది. క్యాష్‌బాక్స్‌లో రూ.80వేలకుపైగా ఉందని బాధితుడు తెలిపాడు. ఏఎస్‌ఐ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. 


 

Updated Date - 2022-05-21T05:38:14+05:30 IST