పగలు విద్యుత్‌ మరమ్మతులు..

ABN , First Publish Date - 2021-01-27T05:20:25+05:30 IST

ఆ యువకులు పగలంతా గ్రామాల్లో విద్యుత్‌ మరమ్మతు పనులు చేస్తుంటారు. రాత్రయితే గొర్రెలు, కోళ్లను దొంగిలిస్తుంటారు.

పగలు విద్యుత్‌ మరమ్మతులు..


రాత్రుళ్లు దొంగతనాలు

గొర్రెలు, కోళ్లను దొంగిలిస్తున్న ఇద్దరు యువకుల పట్టివేత

రణస్థలం, జనవరి 26 : ఆ యువకులు పగలంతా గ్రామాల్లో విద్యుత్‌ మరమ్మతు పనులు చేస్తుంటారు. రాత్రయితే గొర్రెలు, కోళ్లను దొంగిలిస్తుంటారు. దీనికోసం ముందుగా గ్రామాల్లో రిక్కీ నిర్వహించి.. ఎవరి దగ్గర కోళ్లు, గొర్రెలు ఉన్నాయో తెలుసుకుంటారు. ఆ తరువాత చీకటి పడగానే వాటిని ఎత్తుకుపోతుంటారు. గత కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటప డింది. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని కొండములగాం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు విద్యుత్‌ లైన్ల మరమ్మతు పనులు చేస్తుంటారు. ఓసారి మహంతిపాలేం పంచాయతీ పరిధిలోని కెళ్లపేట గ్రామానికి విద్యుత్‌ మరమ్మతుల కోసం వెళ్లారు. ఆ గ్రామ పెద్ద వద్ద గొర్రెలు, కోళ్లు ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై కెళ్లపేట వెళ్లి నాలుగు గొర్రెలు, 20 కోళ్లను దొంగిలించారు. అయితే, మనుషుల అలికిడి కావడంతో ఆ ఇద్దరూ ద్విచక్ర వాహనాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఆ బైక్‌ను గుర్తించిన గ్రామపెద్ద.. కొండము లగాం గ్రామానికి చెందిన పెద్దల దృష్టికి విషయం తీసుకెళ్లాడు. దీంతో మంగళవారం మండల కేంద్రంలో పంచాయితీపెట్టారు. ఈ వ్యవహారంపై తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. 



Updated Date - 2021-01-27T05:20:25+05:30 IST