Oct 19 2021 @ 00:59AM

వారం రోజులు ముందుగానే..

పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్‌’ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌ నాలుగున విడుదల  చేయడానికి మొదట ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని వారం రోజుల ముందుగానే అంటే  ఈ నెల 29న రిలీజ్‌ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.  తనయుడు నటించే ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ నిర్మాత.  అంతే కాదు కథ, మాటలు, స్ర్కీన్‌ప్లేను కూడా ఆయన సమకూర్చారు. ఛార్మీ మరో నిర్మాత. పూరి శిష్యుడు  అనిల్‌ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయిక. విడుదల తేదీని ప్రకటిస్తూ హీరో, హీరోయిన్ల పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు.