కోల్కతా : బీర్భూమ్ హింసాకాండ ఘటన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదేశంతో బెంగాల్ పోలీసులు అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.బెంగాల్ రాష్ట్రంలో అక్రమ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని సీఎం ఆదేశించిన దృష్ట్యా పోలీసులు 10 రోజుల పాటు సోదాలు చేయాలని డీఐజీలు, ఎస్పీలను ఆదేశించారు. అక్రమ బాంబులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిపై పోలీసులు నిఘా వేశారు.
ఈ ప్రత్యేక దాడులను ఏడీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.బీర్భూమ్ జిల్లాలో ఓ రాజకీయ నాయకుడిని కొందరు హతమార్చారు.అనంతరం ఇళ్లకు నిప్పంటించి 8మందిని హతమార్చారు. రాజకీయ పక్షాలకు అతీతంగా అక్రమ ఆయుధాలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అక్రమ ఆయుధాల గుట్టు వీడుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి