Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగిసిన నాలుగో రోజు ఆట.. కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పర్యాటక జట్టు ముందు 284 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.


అనంతరం బ్యాటింగ్  ప్రారంభించిన న్యూజిలాండ్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. అశ్విన్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి కివీస్ ఓపెనర్ విల్ యంగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 6 బంతులు ఎదుర్కొన్న యంగ్ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.


ఐదో రోజు భారత్ విజయానికి 9 వికెట్లు అవసరం కాగా, కివీస్ విజయానికి 280 పరుగులు అవసరం. దీంతో చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement