తన తలని షేవ్ చేసుకున్న వార్నర్.. విరాట్‌కు సవాల్

ABN , First Publish Date - 2020-03-31T20:44:43+05:30 IST

ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)తో పోరాడుతున్న వారికి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ వినూత్నంగా

తన తలని షేవ్ చేసుకున్న వార్నర్.. విరాట్‌కు సవాల్

ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)తో పోరాడుతున్న వారికి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ వినూత్నంగా మద్దతు తెలిపాడు. ఈ మహమ్మారిపై పోరాడుతున్న వారికి మద్దతుగా వార్నర్ ట్రిమ్మర్‌తో తన తలని షేవ్ చేసుకొని.. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. అంతేకాక.. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించాలని వార్నర్ కోరాడు.


కరోనా వైరస్ ఆస్ట్రేలియాలో 4,460 మందికి సోకినట్లు. అందులో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే సంస్థ పేర్కొంది.


మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌లో జరగాల్సిన ఆస్ట్రేలియా పర్యటన వాయిదా పడటమో.. లేదా పూర్తిగా రద్దయ్యే పరిస్థితి ఉందని జట్టు కెప్టెన్ టిమ్ పైన్ తెలిపాడు. ‘‘ఈ పర్యటనపై అవగాహన రావాలంటే మనం ఐన్‌స్టైన్ కావల్సిన అవసరం లేదు. అది జూన్ నెలలో. అది రద్దవుతుందో.. లేదా వాయిదా పడుతుందో ఇప్పుడు చెప్పలేము’’ అని పైన్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-03-31T20:44:43+05:30 IST