దౌల్తాబాద్‌ విద్యార్థికి చెన్నై ఐఐటీలో సీటు

ABN , First Publish Date - 2021-06-18T05:35:32+05:30 IST

దౌల్తాబాద్‌ విద్యార్థికి చెన్నై ఐఐటీలో సీటు

దౌల్తాబాద్‌ విద్యార్థికి చెన్నై ఐఐటీలో సీటు

(ఆంధ్రజ్యోతి వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చెన్నై ఐఐటీలో  జిల్లాలో వెనకబడిన ప్రాంతానికి చెందిన ఓ గిరిజన విద్యార్థి సీటు సాధించారు. దౌల్తాబాద్‌ మండలం, రాయలగుట్ట తండాకు చెందిన కె.హన్మంత్‌నాయక్‌ ఈ విద్యా సంవత్సరం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పీజీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆఖరి సంవత్సరం చదువుతూనే హన్మంత్‌నాయక్‌ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌లో ప్రవేశం కోసం ఐఐటీ జామ్‌ -2021 పరీక్ష రాశాడు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన ఆయనకు చెన్నై ఐఐటీలో ఎంఎస్సీ మ్యాథ్స్‌లో సీటు లభించింది. ఈ మేరకు హన్మంత్‌నాయక్‌కు బుధవారం రాత్రి సమాచారం అందింది. డిగ్రీ ప్రారంభం నుంచే సరైన శిక్షణ, ప్రణాళికతో ముందుకు సాగితే ఐఐటీ వంటి సంస్థల్లో సీటు సాధించడం చాలా తేలికని హన్మంత్‌నాయక్‌ అన్నారు. చైన్నై ఐఐటీలో ఎంఎస్సీ పూర్తి చేస్తూనే సీఎస్‌ఐఆర్‌(పీహెచ్‌డీ)లో సీటు సాఽధించి గణితంలో పరిశోధనలు చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్‌లోని మ్యాథ్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ నిర్వాహకులు రత్నాకర్‌ ఇచ్చిన శిక్షణ, సూచనలతోనే తాను ఐఐటీలో సీటు సాధించగలిగానని ఆయన తెలిపారు. తనను అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.

Updated Date - 2021-06-18T05:35:32+05:30 IST