క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో డాక్ట‌ర్ నిధి వ‌ర‌ల్డ్ రికార్డు!

ABN , First Publish Date - 2020-08-09T11:41:59+05:30 IST

ప్రపంచమంతా కరోనా మ‌హ‌మ్మారితో పోరాడుతోంది. ఈ నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల త‌ర‌పున ప‌‌లు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు...

క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో డాక్ట‌ర్ నిధి వ‌ర‌ల్డ్ రికార్డు!

కోట: ప్రపంచమంతా కరోనా  మ‌హ‌మ్మారితో పోరాడుతోంది. ఈ నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల త‌ర‌పున ప‌‌లు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు కొందరు క‌రోనాపై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించేందుకు త‌మవంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ఒక‌రే రాజస్థాన్‌లోని కోటకు చెందిన డాక్టర్ నిధి ప్రజాపతి. ప్రపంచంలోని 5 దేశాలకు చెందిన‌ 64 మంది పౌరుల సహాయంతో ఇంట్లోనే ఉంటూ, హమ్ హోంగే కామియాబ్ గీతం పాడటం ద్వారా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించారు.  ఈ సంద‌ర్భంగా సొసైటీ హౌస్ ఈవ్ ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత డాక్టర్ నిధి ప్రజాపతి మాట్లాడుతూ ఈ వ‌రల్డ్ రికార్డును త‌న‌కు బ్రావో ఇంట‌ర్నేష‌న‌ల్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్ త‌ర‌పున ఆసియాన్ స‌బ్ కాంటినెంట‌ల్ అడిష‌న్‌లో అంద‌జేశార‌ని తెలిపారు. దీనిని కోటలోని వర్ద‌మాన్ మహావీర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెస‌ర్ ఆర్ఎల్ గోద్రా త‌న‌కు ప్ర‌ధానం చేశార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా గోద్రా మాట్లాడుతూ త‌మ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన విద్యార్థిని వ‌రల్డ్ రికార్డు నెల‌కొల్ప‌డం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. ఐక్య‌త‌ను చాటే ఈ గీతంలోని తొలి పంక్తిని ప‌లువురు పాడ‌గా, దానిని నిధి ఒక వీడియోగా రూపొందించారు. ఈ పాట పాడిన‌వారిలో వివిధ‌రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఉన్నారు. 



Updated Date - 2020-08-09T11:41:59+05:30 IST