గుంతలో పాత నోట్లు.. ఓ అమాయకపు తల్లి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-07-11T15:54:01+05:30 IST

కుమార్తె వివాహం కోసం దాచిన రూ.500, రూ.1,000 నోట్లు చెల్లవని తెలియడంతో ఆ అమాయకపు తల్లి తల్లడిల్లిపోయింది. నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపం

గుంతలో పాత నోట్లు.. ఓ అమాయకపు తల్లి ఏం చేసిందంటే..

చెన్నై: కుమార్తె వివాహం కోసం దాచిన రూ.500, రూ.1,000 నోట్లు చెల్లవని తెలియడంతో ఆ అమాయకపు తల్లి తల్లడిల్లిపోయింది. నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపం పట్టియమేడుకు చెందిన ఉష (52) దివ్యాంగురాలు. ఉపాధి హామీ పనులకు వెళ్తూ తన కుమార్తె వివాహం కోసం డబ్బులు పొదుపు చేసింది.  ఇంటి వెనుక ప్రాంతంలో గుంత తవ్వి అందులో రూ.500, రూ.1,000 నోట్లను ఉంచింది. ఇటీవల ఆమె భర్త  రాజా దురై ఇంటి పునర్మిర్మాణం చేపట్టగా ఆ  డబ్బుల బ్యాగు బయటపడింది. అందులో రూ.1,000 నోట్లు పది, రూ.500 నోట్లు 51 ఉన్నాయి. దీంతో దిగ్ర్భాంతి చెందిన రాజాదురై, నాలుగేళ్ల క్రితమే ఈ నోట్లు చెల్లవని ప్రభుత్వం ప్రకటించిందని భార్యతో తెలిపాడు. తనకు ఈ విషయం ఎవరూ చెప్పలేదని ఆమె అమాయకంగా బదులిచ్చింది. ఆ దివ్యాంగురాలికి సాయం చేసేలా ప్రభుత్వం ముందుకు రావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-11T15:54:01+05:30 IST