మద్యం మత్తులో భర్త.. ప్రియుడిని ఇంటికి పిలిచిన భార్య.. వారిద్దరూ గదిలో ఉన్నపుడు సడన్‌గా అత్త ఎంట్రీ ఇవ్వడంతో..

ABN , First Publish Date - 2021-12-02T21:47:01+05:30 IST

పెళ్లైన తర్వాత కూడా ఓ మహిళ ప్రియుడితో ప్రేమాయణం నడిపించింది. ఈ క్రమంలోనే మద్యం తాగే అలవాటు ఉన్న భర్తను ఆమె మరింత ప్రోత్సహించింది. పక్కనే ఉండి మరీ మద్యం తాగించింది. మ

మద్యం మత్తులో భర్త.. ప్రియుడిని ఇంటికి పిలిచిన భార్య.. వారిద్దరూ గదిలో ఉన్నపుడు సడన్‌గా అత్త ఎంట్రీ ఇవ్వడంతో..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన తర్వాత కూడా ఓ మహిళ ప్రియుడితో ప్రేమాయణం నడిపించింది.  ఈ క్రమంలోనే మద్యం తాగే అలవాటు ఉన్న భర్తను ఆమె మరింత ప్రోత్సహించింది. పక్కనే ఉండి మరీ మద్యం తాగించింది. మద్యం మత్తులో అతడు స్పృహ కోల్పోయిన వెంటనే.. ప్రియుడికి కబురు పంపింది. దీంతో ప్రియుడు రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ గదిలో ఉండగా.. అత్త సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కు పూనమ్ అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. ఈ క్రమంలో పూనమ్ తన భర్త ప్రవీణ్, అత్త చినదేవి అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్‌ను పెళ్లి చేసుకునప్పటికీ.. పూనమ్ మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. చినదేవి తన చిన్నకొడుకు ఇంటికి వెళ్లిన సమయంలో.. పూనమ్ దగ్గరుండి మరీ భర్త ప్రవీణ్‌కు మద్యం తాగించింది. మద్యం ఎక్కువై ప్రవీణ్ స్పృహ కోల్పోయిన తర్వాత ప్రియుడికి కబురు పంపింది. దీంతో అతడు ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే.. వారిద్దరూ ఓ గదిలో అసభ్యకర స్థితిలో ఉన్నపుడు సడన్‌గా చినదేవి అక్కడకు ఎంట్రీ ఇచ్చింది. దీంతో పూనమ్ షాకైంది. 



అంతేకాకుండా తన విషయం ఎక్కడ బయటపడుతోందనని ప్రియుడితో కలిసి అత్తను హతమార్చింది. అనంతరం.. ప్రమాదవశాత్తు ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించింది. పూనమ్ చెప్పిన మాటలను విశ్వసించిన కుటుంబ సభ్యులు.. పోస్ట్‌మార్టం చేయించకుండానే చినదేవి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత తల్లి మరణంపై ప్రవీణ్ సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీకెమెరా దృశ్యాలను పరిశీలించాడు. దీంతో పూనమ్ బండారం బయటపడింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పూనమ్‌తోపాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 




Updated Date - 2021-12-02T21:47:01+05:30 IST