కేటీఆర్ తోక ముడిచిన తారక రామారావు: దాసోజు

ABN , First Publish Date - 2021-02-27T22:51:11+05:30 IST

తన పేరును తోక ముడిచిన తారక రామారావుగా మార్చుకోవాలని కే

కేటీఆర్ తోక ముడిచిన తారక రామారావు: దాసోజు

హైదరాబాద్: తన పేరును తోక ముడిచిన తారక రామారావుగా మార్చుకోవాలని కేటీఆర్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్  సూచించారు. లక్ష ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధమని విపక్షాలకు కేటీఆర్‌ సవాల్ విసిరారని ఆయన పేర్కొన్నారు. ఆ సవాల్‌పై చర్చకు తాము వస్తే తేలుకుట్టిన దొంగలా కేటీఆర్‌ మారిపోయారని ఆయన మండిపడ్డారు. ఆకు రౌడీ ఆలుగడ్డల శ్రీనివాస్‌తో తనను తిట్టించడం కేటీఆర్‌కు తగదని ఆయన హితవు పలికారు. నిరుద్యోగ సమస్యలపై తాము మాట్లాడితే గొట్టం గాళ్లమా అని ఆయన ప్రశ్నించారు.  



తనను విమర్శించిన తలసాని శ్రీనివాస్‌పై దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. బుద్దిలేని సన్నాసి తలసాని అని, తెలంగాణ ఉద్యమానికి తలలేని శ్రీనివాస్‌కు ఏం సంబంధమని ఆయన విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుడు పట్టే రాజకీయ బిక్షగాడు తలసాని  అని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. గొట్టంగాళ్లే నీకు కర్రుకాల్చి వాత పెడతారని దాసోజు హెచ్చరించారు. చెంచాగిరి చేసే నీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు.   


కిరణ్ కుమార్ సీఎంగా దిగిపోయే నాటికి లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని దాసోజు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయనడం పచ్చి అబద్ధమని ఆయన మండిపడ్డారు. తాను చెప్పేది తప్పని గన్‌పార్క్‌కు వచ్చి కేటీఆర్ నిరూపిస్తే అక్కడే గొంతుకోసుకుని చనిపోతానని దాసోజు శ్రావణ్ సవాల్ విసిరారు. 

Updated Date - 2021-02-27T22:51:11+05:30 IST